కరోనా లాక్ డౌన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ కూడా లాక్ చేసి పడేసింది. సెలబ్రిటీ సామాన్యుడు అనే తేడా లేకుండా అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలంటూ దేశ విదేశాలకు ఇతర ప్రాంతాలకు చక్కర్లు కొట్టే సినీతారలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యామిలీస్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ తమ ఇంట్లో జరుగుతున్న విశేషాలన్నీ సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు. నిజానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. 'సరిలేరు మీకెవ్వరు' సినిమా తర్వాత హీరో మహేష్‌బాబు మరో సినిమాకు రెడీ అయ్యారు. గీతగోవిందం ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఓ సినిమా తర్వాత మరో సినిమా షూటింగ్‌కు వెళ్లే మధ్యలో మహేష్ కనీసం రెండు మూడు నెలల గ్యాప్ తీసుకుంటాడు. అయితే ఈసారి ఈ మహమ్మారి వలన అంతకు ఎక్కువ రోజులే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అయితే ఈ సమయాన్ని మహేష్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన కుటుంబంతో సంతోషంగా ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సరదాగా రోజుకో కొత్త ఆట ఆడుకుంటున్నాడట. ఇక మహేష్ తన పిల్లలతో చేసే సందడి అంత కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఆయన సతీమణి నమ్రత. తాజాగా మహేష్ లాక్ డౌన్ లో ఎంజాయ్ మూమెంట్స్ అన్నీ తన పిఆర్ టీమ్ మళ్లీ సోషల్ మీడియాలో రీపోస్టు చేయనుందట. ఇక ఆ పోస్టులన్నీ ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో పోస్ట్ చేయనుందట. ఒక సెలబ్రిటీ తన పిల్లలతో ఇలా పిల్లాడిలా కలిసిపోవడం విశేషమే కదా అంటున్నారు.