మహేష్ అండ్ ప్రభాస్ తో ఎన్టీఆర్ ఢీ?

Update: 2018-02-08 08:01 GMT

ఒక సంక్రాంతి అయిపోగానే మరో సంక్రాంతి గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచిస్తుంటారు?. ఇంకెవరు మన సినిమావాళ్లే. ఏడాది సమయం ఉన్నా సరే చాలా ఓపిగ్గా ఆ డేట్ కోసం పని చేసుకుంటూ కరెక్ట్ గా ఆ టైమ్ కి సినిమాలను రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది 2019 సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఎదో చిన్న హీరోలు అనుకుంటే పొరపాటే. అందరు పెద్ద స్టార్లె రాబోతున్నారు. మినిమామ్ ఈజీగా 400 కోట్ల బిజినెస్ జరగడం కాయంగా కనిపిస్తోంది.

మహేష్ - ప్రభాస్ సినిమాలు సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ సినిమాల పనులను కొనసాగిస్తున్నాయి. మహేష్ 25వ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు -అశ్వనీదత్  కలిసి నిర్మిస్తున్న ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సాహో కూడా అదే డేట్ కి రావడానికి ప్లాన్ వేసింది. ముందుగా రిలీజ్ చేయాలని అనుకున్నా ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం ఆ డేట్ కె సినిమా వచ్చేలా ఉంది. ఇక మరో బెస్ట్ కాంబినేషన్ త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా సంక్రాంతికి రానున్నట్లు తెలుస్తోంది. ముందుగా సినిమాను త్రివిక్రమ్ ఆరు నెలల్లో పూర్తి చేయాలని అనుకున్నాడు.

కానీ ఇటీవల సెట్ చేసుకున్న షెడ్యూల్స్ అలాగే తారల కాల్షీట్స్ ప్రకారం చిత్ర యూనిట్ మినిమామ్ 8 నెలలు పడుతుందని ఒక క్లారిటికీ వచ్చింది. దీంతో కాస్త లెట్ అయినా పరవాలేదు అని ఎన్టీఆర్ - త్రివిక్రమ్ డిస్కస్ చేసుకొని సంక్రాంతి బరిలోనే దిగాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గత ఏడాది జై లవ కుశ సినిమాతో వచ్చిన ఎన్టీఆర్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది దసరా కి గాని అలాగే దీపావళి కి గాని మరో సినిమాతో వద్దామని అనుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. మార్చ్ లో వీరి ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Tags:    

Similar News