హీరోలు ఎప్పుడో కానీ హీరోయిన్లని పొగడరు. కానీ మహేష్ మాత్రం భలే పొగుడుతుంటాడు. వండర్ ఫుల్ యాక్ట్రెస్ - టెర్రిఫిక్ యాక్ట్రెస్ అని ఆకాశానికెత్తేస్తుంటాడు. ఆయన హీరోయిన్లని ఏ రేంజ్ లో పొగడుతుంటాడో బిజినెస్ మేన్ ఆడియో ఫంక్షన్ లో వీడియోలు కట్ చేసి మరీ చూపించాడు పూరి జగన్నాథ్. అది చూసి జనాలు నిజమే కదా అనుకున్నారు. ఇప్పటికి కూడా మహేష్ లో ఏ మాత్రం మార్పులేదు. తనతో కలిసి నటించిన ప్రతి హీరోయిన్ నీ మెచ్చుకుంటుంటాడు. ఒక రకంగా అది మంచి పరిణామమే. ఆ హీరోయిన్లకి కూడా మంచి ఎంకరేజ్ మెంట్ గా వుంటుంది. అయితే బ్రహ్మోత్సవం విషయానికొచ్చేసరికి హీరోయిన్లందరినీ హోల్ సేల్ గా పొగిడేశారు. అసలే ముగ్గురు హీరోయిన్లు కదా, ఒకొక్కరి గురించి పొగిడితే సమయం సరిపోదనుకొన్నాడో ఏంటో మరి... ముగ్గురినీ కలిపి పొగిడేశాడు మహేష్.
ముగ్గురు హీరోయిన్లతో కలిసినటించడం ఎలా ఉంది అని ఓ లైవ్ ఇంటర్వ్యూలో మహేష్ ని అడిగినప్పుడు ముగ్గురూ టాలెంటెడే అని సమాధానమిచ్చాడు. ``హీరోయిన్లని చూసినప్పుడు ఓ విషయం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వాళ్లు పదిహేను రోజులకి ఓ సెట్ కి వెళుతుంటారు. కానీ ఏ సెట్ కి వెళ్లినా ఆ క్యారెక్టర్ లో అలా ఒదిగిపోతుంటారు. అదెలా సాధ్యమో నాకు అర్థం కాదు. నేనైతే అలా చేయలేను. ఒక సినిమా తర్వా త ఇరవై రోజులు గ్యాప్ తీసుకుంటే తప్ప కొత్త సినిమాకోసం రంగంలోకి దిగలేను. కానీ హీరోయిన్లు మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. వాళ్లు ఆ విషయంలో నిజంగా గ్రేట్. అదంతా వాళ్ల సొంత టాలెంటు`` అని పొగిడేశాడు మహేష్. ఆయన చెప్పే మాటల్లోనూ వాస్తవముంది మరీ! ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారిపోవడం అంత సులువేమీ కాదు. కానీ కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ వస్తున్నప్పుడు కాస్త కష్టమైనా చేయాలి కదా!!