మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న 25వ సినిమా మహర్షి ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనిదత్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ - రైతు బ్యాక్ డ్రాప్ తో ఆసక్తికర కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 26 ప్రారంభం కానుంది. ఆ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్టు పనుల్లో సుక్కూ బిజీగా ఉన్నారు.
తదుపరి మహేష్ నటించే 27వ సినిమా గురించి ఆసక్తికర సమాచారం అందింది. తదుపరి అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుందని తెలుస్తోంది. గీత గోవిందం అసాధారణ విజయంతో ఖుషీగా ఉన్న అల్లు అరవింద్ ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సందీప్ రెడ్డి వినిపించిన లైన్ సూపర్ స్టార్ మహేష్ ని గొప్పగా ఇంప్రెస్ చేసింది. రెండో దఫా కథను అతడు వినిపించాడుట. ఇక గో అహెడ్! అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ... ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.
2020లో మహేష్ 27వ సినిమా ప్రారంభం కానుందిట. ఆ మేరకు మహర్షి సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మహేష్ ని సుక్కూ తన సినిమాలో ఒక సామాన్యుడిగా చూపిస్తున్నాడన్న ప్రచారం ఉంది. అంతకంటే డిఫరెంటుగా నవతరం దర్శకుడు ఆలోచిస్తున్నాడా? ఆ చిత్రంలో సందీప్ రెడ్డి మహేష్ ని ఏ తరహా పాత్రలో చూపిస్తారోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. సందీప్ రెడ్డి ప్రస్తుతం హిందీ `అర్జున్ రెడ్డి` రీమేక్ తో బిజీగా ఉన్న సంగతి విదితమే. షాహిద్ కపూర్ ఆ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.