ఈ సంక్రాంతి కానుకగా `సరిలేరు నీకెవ్వరు`..`అల వైకుంఠపురములో` బాక్సాఫీస్ వద్ద పోటీపడిన సంగతి తెలిసిందే. బన్ని.. మహేష్ మధ్య బాక్సాఫీస్ వార్ లో బన్నీదే పై చేయి అయ్యింది. సక్సెస్ మీట్ పేరుతో ఇరు టీమ్ లు బోలెడంత హడావుడి చేసాయి. కలెక్షన్లపై రిపోర్టులు అందిస్తూ.. సరికొత్త యుద్దానికి తెర లేపారు. ఒకరికొకరు పోటీ పడి గొప్పలకు పోయారు. అయితే అంతిమంగా సరిలేరు కంటే అల ఓ మెట్టు పైనే ఉందని ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి. ఇప్పుడు బుల్లితెర టీఆర్పీ విషయంలోనూ సరిలేరు టీమ్ హడావుడి ఇలానే ఉంది. తాజాగా సరిలేరు దూకుడు బుల్లి తెరపైనా కొనసాగిందని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ఉగాది సందర్భంగా జెమినీ టీవీలో ఈ మూవీ ప్రసారమైంది.
బుల్లి తెరపై 23.4 టీఆర్పీ సాధించి ఆల్ టైమ్ టాప్ లో నిలిచిందంటూ ప్రచారం చేసుకోవడం చర్చకొచ్చింది. గత 15 ఏళ్లుగా ఏ చిత్రానికీ ఇంత టీఆర్ పీ రాలేదని ప్రచారం హోరెత్తిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా బాహుబలి-2 రికార్డులను సైతం చెరిపేసి బుల్లి తెర టీఆర్ పీలో కొత్త రికార్డు నమోదు చేసిందంటూ చంకలు గుద్దుకోవడం చర్చకు వచ్చింది. అయితే ఈ ప్రచారం చూసిన నెటిజనులు నిజమేగా బాహుబలి-1.. బాహుబలి-2 నే బీట్ చేసేంత సత్తా ఈ ఒక్క సరిలేరు నీకెవ్వరుకే ఉందిలే అంటూ వ్యంగ్యంగా విసుర్లు విసిరేస్తున్నారు. నిజమే అంతర్జాతీయ సినిమా రికార్డులను సైతం సరిలేరు బ్రేక్ చేయడం బావుందే అంటూ... ఇంతకన్నా పెద్ద జోక్ ఎక్కడ దొరుకుతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.
అప్పుడూ ఇలాంటి ప్రచారమే... ఇప్పుడూ (బుల్లి తెర) ఇలాంటి ప్రచారమేనా? ఈ టీఆర్పీ నిజమే అయినా.. దానివెనక అసలు కారణాన్ని తెలుసుకోవాలి కదా! అని సెటైర్లు వేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరికి వెబ్ సహా ఇతర సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు వచ్చాయో తెలిసిందే. డివైడ్ టాక్ వచ్చినా పండగ సెలవులు కలిసొచ్చి సినిమా బయటపడింది. రొటీన్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా మూస కామెడీతో ఓ వర్గానికి మాత్రమే రీచ్ అయిందని విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు బుల్లితెర టీఆర్పీ దులిపేసింది అంటే దానికి కారణం కరోనా ఎఫెక్ట్ అని విశ్లేషిస్తున్నారు. వైరస్ దెబ్బకు లాక్ డౌన్లు ప్రకటించడంతో ఊరూ వాడా పల్లె పట్నం అనే తేడా లేకుండా అందరూ ఇళ్లలో పోగుపడ్డారు. ఇక వీళ్లకు టీవీ వ్యాపకం తప్ప ఇంకేం ఉంది? అలా టైమ్ పాస్ చేయడం వల్లనే సరిలేరుకి ఇంత టీఆర్పీ వచ్చింది! అంటూ అసలు గుట్టు బయట పెట్టేస్తున్నారు. ఇక బాహుబలి బుల్లితెర ప్రీమియర్ టైమ్ లో ఇలాంటి సన్నివేశాలేవీ లేవు మరి!! ఉంటే వేరేగా ఉండేదేమో!!