సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో దూకుడు మీదున్న మహేష్.. మరోసారి తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దీనికి తగ్గట్టుగానే జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన SVP పోస్టర్స్ - సాంగ్స్ - టీజర్ - ట్రైలర్.. ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇది హై వోల్టేజ్ యాక్షన్ - లవ్ - కామెడీ - రొమాన్స్ - ఎమోషన్ కలబోసిన పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అనే విషయం వెల్లడించారు. ఇందులో మహేష్ మాస్ స్వాగ్ మరియు డైలాగ్స్ వంటివి వింటేజ్ సూపర్ స్టార్ ను గుర్తు చేశాయి.
'సర్కారు వారి పాట' సినిమాతో ఇంతకు ముందెన్నడూ లేని మాస్ యుఫోరియాను చూసే సమయం ఆసన్నమైంది. గత రెండున్నరేళ్లుగా సూపర్ స్టార్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. మరికొన్ని గంటల్లో మహేశ్ బాబు మాస్ అవతారానికి సాక్ష్యంగా నిలవబోతున్నారు.
అభిమానుల ఉత్సుకతను రెట్టింపు చేయడానికి మేకర్స్ బెనిఫిట్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తెల్లారుజమున 4 గంటలకు 'సర్కారు వారి పాట' స్పెషల్ షోలు ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది.
ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్ మీడియాలో తెలుపుతూ.. థియేటర్ల వివరాలు తెలిపింది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లోని భ్రమరాంబ - మల్లికార్జున - విశ్వనాథ్ థియేటర్ లతో పాటుగా మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో ఫ్యాన్స్ కోసం 'సర్కారు వారి పాట' బెనిఫిట్ షోలు వేయనున్నారు. మార్నింగ్ నాలుగు గంటలకే ఈ షోలు ప్రదర్శించబడతాయి.
కాగా, 'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురాం పెట్లా దర్శకత్వం వహించారు. ఇందులో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని - సుబ్బరాజు - వెన్నెల కిశోర్ - నదియా - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
SVP చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్ - 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించగా.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.