మొత్తానికి యాంటీ ఫ్యాన్స్ ప్రచారం పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు కు `సర్కారు వారి పాట` రూపంలో సూపర్ హిట్ పడింది. మహేష్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో వస్తున్న `సర్కారు వారి పాట` కోసం మహేష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని గట్టి నమ్మకంతో థియేటర్లకు వచ్చారు. దీంతో ఈ సినిమా వారు అనుకున్నట్టుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.
ఓపెనింగ్స్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. సినిమాలో మహేష్ చెప్పిన మాసీవ్ డైలాగ్‌లు, కీర్తి సురేష్ మధ్య కుదిరిన కెమిస్ట్రి, తమన్ అందించిన పాటలు సినిమా ఓ రేంజ్ లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ఈ మూవీలో మహేష్ కోసం పరశురామ్ రాసిన డైలాగ్ లు కూడా ప్రధాన హైలైట్ గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. పొలిటికల్ టచ్ ఇస్తూ వైఎస్ జగన్ ని గుర్తు చేస్తూ మహేష్ చెప్పిన డైలాగ్ లు కూడా థియేటర్లలో మోత మోగిస్తున్నాయి.
`నేను విన్నాను.. నేను వున్నాను` అనే డైలాగ్ ట్రైలర్ లో ఏ రేంజ్ లో పేలిందో థియేటర్లలో అంతకు మించి రచ్చ చేస్తోంది. ఈ డైలాగ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది కావడంతో దీన్ని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. ఇక ఇందులో మహేష్ చెప్పిన మరో డైలాగ్ ఇప్పుడు మరింత ట్రెండ్ అవుతోంది. `జనం తోడు ఉన్నోడికి విజయం దక్కకపోయినా ఆ జనం అతడి వెన్నంటే ఉంటారు` అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ భీమ్లానాయక్ పవన్ ని ఉద్దేశించి చెప్పిందే అని ప్రచారం జరుగుతోంది.
ఈ డైలాగ్ తో పాటు ఈ సినిమాలో పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ `భీమ్లానాయక్` చిత్రంలోని `లాలా.. భీమ్లా..` కూడా వినిపించడంతో సినిమాలో ఈ డైలాగ్ వినిపించిన ప్రతీ సారి మహేష్ ఫ్యాన్స్ ఈలలు వేస్తూ థియేటర్లలో గోల గోల చేస్తున్నారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన సుబ్బరాజు ఫోన్ రింగ్ టోన్ గా `లాలా.. భీమ్లా`ని వాడారు. ఫోన్ వచ్చిన ప్రతీసారి ఈ రింగ్ టోన్ థియేటర్లలో దద్దరిల్లిపోతోంది. అంతే కాకుండా సినిమా ప్రారంభంలో పచ్చ బొట్టు సీన్ లో చిరంజీవి పచ్చబొట్టు కావాలా? . కృష్ణది కావాలా అని ఓ ముసలావిడ అడిగితే చిరంజీవి పేరు వినిపించడంతో ఆడియన్స్ విజిల్స్ తో థియేటర్ లు మోత మోగిపోతున్నాయి.
ఇది గమనించిన వారంతా పవన్ `భీమ్లానాయక్` రింగ్ టోన్ ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. కావాలనే పవన్, చిరుల ప్రస్థావన తీసుకోచ్చారని, ఇది మంచి పరిణామమని ఈ విషయాన్ని ఫ్యాన్స్ స్వాగతించాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.