పవర్ స్టార్ నా ఫ్రెండే అంటున్న మహేష్

Update: 2017-09-26 04:30 GMT
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ స్పైడర్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ మూవీతో మహేష్ మొదటిసారిగా తమిళంలో అడుగు పెట్టబోతున్నాడు. దీనకితోడు అతడి కెరీర్ లోనే స్పైడర్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఈ మూవీ ప్రమోషన్లపై మహేష్ గట్టిగానే దృష్టి పెట్టాడు. ఈమధ్యనే చెన్నై మీడియాలో అందరికీ పేరుపేరునా ఇంటర్వ్యూలు ఇచ్చి తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. సినిమా ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు వీలున్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటున్నాడు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కోసం మహేష్ బెంగుళూరు వెళ్లాడు. అక్కడ కన్నడ మీడియాతో సమావేశమై వారందరి ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. మంచి స్క్రిప్టు దొరకాలే కానీ స్ట్రయిట్ కన్నడ సినిమాలో నటించేందుకు తాను సిద్ధమేనని చెప్పుకొచ్చాడు. శాండల్ వుడ్ లోనూ తనకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాడు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మంచి ఫ్రెండని చెప్పి అక్కడి ప్రేక్షకులకు ఆనందం పంచాడు. మహేష్ తన సినిమా ప్రమోషన్ కోసం బెంగుళూరు రావడం ఇదే తొలిసారి.

మహేష్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేవిగా చెప్పుకునే హిట్ సినిమాల్లో ఒక్కడు - దూకుడు సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ఈ రెండు సినిమాలనూ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా రీమేక్ చేయడం విశేషం. మహేష్ తో దూకుడు సినిమా తీసిన 14 రీల్స్ సంస్థే కన్నడలోనూ తీసింది. ఈ సినిమా అక్కడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
Tags:    

Similar News