కరోనా కల్లోలం ప్రపంచానికి రకరకాల పాఠాలు నేర్పిస్తుంటే.. మన సెలబ్రిటీలకు ఈ ఖాళీ సమయం రకరకాలుగా ఉపయోగపడుతోంది. ఒకరకంగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే సమయం దొరికితే.. పనిలో పనిగా క్వాలిటీ డైరెక్టర్లను క్వాలిటీ కథల్ని వెతుక్కునే ఛాన్స్ కూడా దొరుకుతోంది. సూపర్ స్టార్ మహేష్ సంగతి చూస్తే చాలు.. అసలు విషయం అర్థమైపోతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ ఖాళీ సమయాన్ని మంచి కథలు వినేందుకు కేటాయిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ సైతం స్టార్ హీరోల కథలతో పాటు నవతరం దర్శకులు వినిపించే కథల్ని వింటున్నారు. ఇక ఫేస్ టైమ్ ఆఫర్ ఇచ్చి ఫోన్ లోనే వీడియో కాల్స్ ద్వారా కథలు వింటున్నారట. ఈ ఫేస్ టైమ్ అపాయింట్ మెంట్ ఆఫర్ ని పలువురు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిసింది. ఇక అలా విన్న కథల్లో క్రియేటివ్ గా స్టఫ్ ఉన్న వాటిని ఓకే చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నారట. ఇప్పటికే పరశురామ్ స్క్రిప్టును ఓకే చేసిన మహేష్ త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. కరోనా కల్లోలం ఆగితే అంతా సవ్యంగా ఉంటే జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే వీలుందని కథనాలొచ్చాయి.
ఈలోగానే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల మహేష్ కి కథ వినిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏ దర్శకుడు అయినా మహేష్ ని బౌండ్ స్క్రిప్టుతోనే మెప్పించాల్సి ఉంటుంది. పరశురామ్ తర్వాత మాత్రం ఇంకా ఎవరినీ ఖాయం చేయలేదట. కరోనా వల్ల ఎంబీ 27 షూటింగ్ కి బిగ్ గ్యాప్ ఉంది. మరో రెండు నెలలు కరోనా మోగితే.. ఈలోగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇంపార్టెంట్. ఏ కథను ఓకే చేయడం లేదు. ది బెస్ట్ ఏదో దానికోసం వెతుకుతున్నారు. అందుకోసం మహేష్ మారథాన్ స్టైల్లో కథలు వినేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు రిలీజై మూడు నెలలు అయ్యింది. మరో రెండు మూడు నెలలు కరోనా వల్ల వేస్ట్ అవుతోంది. ఈలోగా మంచి కథల్ని లాక్ చేసేందుక షెడ్యూలింగ్ చేయడం తెలివైన పనే. ఇక ఇతర స్టార్ హీరోలు సైతం మహేష్ నే అనుసరిస్తున్నారన్న టాక్ ఇప్పటికే ఉంది.