చెల్లి వస్తే బ్రహ్మోత్సవం బాగుండేదా?

Update: 2016-05-21 11:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో.. చాలాసార్లు కనెక్టివిటీ మిస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా అయిన ఈ మూవీలో.. మహేష్ తన పూర్వీకులను వెతుక్కుంటూ వెళతాడు. పక్కనే మామయ్యల కుటుంబాలను పట్టించుకోకుండా.. ఎక్కడో ఉన్నవారిని వెతుక్కోవడమేంటనే కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఎమోషన్స్ బేస్డ్ గా నడిచే ఈ సినిమాలో.. చెల్లెలి పాత్రను తేల్చేయడం టూమచ్ గా ఉందని చెప్పాలి.

ఫస్టాఫ్ లో ఓ వెబ్ క్యామ్ నుంచి ఛాట్ చేస్తుంది మహేష్ చెల్లెలు. కనీసం ఈమెను మరో సీన్ లో కూడా చూపించలేదు. ఈ సిస్టర్ రోల్ ని సెకండాఫ్ లో ఇంటికి తేవాల్సింది. నాన్న చనిపోయాడని - ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందనే సీన్స్ లో కూడా ఫారిన్ నుంచి చెల్లెలు రాకపోవడం ఆశ్చర్యకరమే. కనీసం క్లైమాక్స్ లో కూడా ఈ పాత్ర మళ్లీ కనిపించకపోవడం గమనించాలి. అన్నా - చెల్లెలు సెంటిమెంట్ ఉంటే.. సెకండాఫ్ పండేదనే టాక్ వినిపిస్తోంది.

ఊళ్లు పట్టుకు తిరిగే అన్నయ్య కోసం.. చెల్లెలు వచ్చుంటే కొంచెం కన్విన్సింగ్ గా ఉండేది. అలాగే సమంత కేరక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి చెల్లెలిని పాత్ర కోసం ఓ సీన్ ఇరికించారా అనుకుంటున్నారు జనాలు. మొత్తానికి ఎడిటింగ్ లో ఎగిరిపోయిన చెల్లెలి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు.. బ్రహ్మోత్సవం చిత్రానికి లోటు అని చెప్పాల్సిందే.

Tags:    

Similar News