తమిళ్ మీడియాకి మహేష్ ఆఫర్!

Update: 2017-09-21 09:20 GMT
మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ విడుదలకు ఇంంకా పట్టుమని వారం సమయం కూడా లేదు. వచ్చే బుధవారం నాడు అంటే సెప్టెంబర్ 27న దసరా స్పెషల్ గా స్పైడర్ థియేటర్లలోకి వచ్చేస్తోంది. అయితే.. ఇప్పటివరకూ కనీసం మహేష్ బాబు ప్రచారం కూడా ప్రారంభించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సహజంగా తన మూవీస్ కి బోలెడంత ప్రచారం చేస్తాడు మహేష్.

ఇప్పుడు స్పైడర్ విషయంలో కూడా సూపర్ స్టార్ దగ్గర చాలానే ప్లాన్స్ ఉన్నాయట. ముఖ్యంగా స్పైడర్ తో కోలీవుడ్ లో గ్రాండ్  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మహేష్. అందుకే అక్కడి మీడియా కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాడట. అక్కడి టీవీ ఛానల్స్ కు.. గేమ్ షోలకు అటెండ్ కానున్న మహేష్.. జర్నలిస్ట్ లకు ఇచ్చే ఇంటర్వ్యూల విషయంలో కూడా స్పెషల్ ప్లాన్స్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అందరికీ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఓకే చెప్పగా.. ఎవరైనా మిస్ అయితే వారికి ఫ్లైట్ టికెట్స్.. హోటల్ రూమ్స్ ఏర్పాటు చేసి హైద్రాబాద్ కు పిలిచి.. ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తారట.

అయితే.. తెలుగు మీడియా సంగతేంటి అంటే మాత్రం ఆన్సర్ రావడం లేదు. గతంలో బ్రహ్మోత్సవం విడుదల సమయంలో.. అందరినీ ఓ స్టార్ హోటల్ కు పిలిచి.. ఒక్కో జర్నలిస్ట్ కు 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయించాడు మహేష్. కోలీవుడ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్న మహేష్ బాబు.. టాలీవుడ్ లో మాత్రం పాత పద్ధతులే పాటిస్తాడనే టాక్ ఉంది.

Tags:    

Similar News