కాలర్ ఎగురేసిన సూపర్ స్టార్

Update: 2019-05-12 13:37 GMT
పాతిక సినిమాల జర్నీలో ఏనాడూ మహేష్ కాలర్ ఎగురవేసింది లేదు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. పోకిరి.. మురారి.. ఒక్కడు.. దూకుడు.. భరత్ అనే నేను .. ఇలా చెప్పుకునేందుకు ఉన్నాయి. కానీ బ్లాక్ బస్టర్ కొట్టినా ఎప్పుడూ కాలర్ ఎగురవేసింది లేదు. కానీ ఈరోజు మహేష్ చాలా కాన్ఫిడెంట్ గా కాలర్ ఎగురవేశారు. తన కెరీర్ 25వ సినిమా మహర్షి తొలి వారంలోనే తన సినిమాల రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుందని చెప్పడమే గాకుండా ఎంతో ఎమోషనల్ గా అభిమానుల గురించి ప్రస్థావిస్తూ.. కాలర్ ఎగురవేయడం అందరిలో ఆసక్తి కలిగించింది. తొలిసారి ఆయన శైలికి విరుద్ధంగా మాస్ స్టైల్లో ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కాలర్ ఎగరేస్తూ.. నా ఫ్యాన్స్‌ సమక్షంలో నేను ఈరోజు కాలర్ ఎగరేస్తున్నా అంటూ ఉత్సాహంగా కనిపించారు.

మహర్షి ఎపిక్ సక్సెస్ వేదికపై సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ - ``నా పాతిక సినిమాల జ‌ర్నీ ఎంతో ప్ర‌త్యేకం. అందులో ఈ సినిమా మ‌రింత ప్ర‌త్యేకం. మహర్షి మూడేళ్ల ప్రాసెస్‌ లో మ‌ర‌చిపోలేని అనుభ‌వాలున్నాయి. దిల్‌ రాజుగారు తొలిసారి క‌థ విని క్లాసిక్ అన్నారు. నాకు ఫోన్ చేశారు. గ‌త ఏడాది ద‌త్తుగారు క‌థ విని ఈ సినిమా ఓ గేమ్ చేంజ‌ర్ అవుతుంది అన్నారు. డ‌బుల్ పాజిటివ్ చూసిన‌ప్పుడు చాలా ఆనందం కలిగింది. నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ ని. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ కు వెళ్లాను. చివ‌ర్లో దోని సిక్స్ కొట్టిన‌ప్పుడు చాలా సంతోష‌ప‌డ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్‌ రాజుగారు సిక్సర్ కొట్టాం అన‌గానే అంతే ఆనందం వేసింది. మూడు పెద్ద బ్యాన‌ర్స్ లో నా సినిమా తెరకెక్కడం గ‌ర్వంగా ఉంది. సాధార‌ణంగా ద‌త్తుగారు ప్రిన్స్‌ .. బాబు అని పిలుస్తుంటారు. విప‌రీతంగా న‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే మ‌హేష్ అని పిలుస్తారు. అలా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తుంటాను. ఈ సినిమా చూసిన త‌ర్వాత ఆయ‌న అలా పిలిచారు. మ‌హేష్ ..నువ్వు స‌మ్‌ థింగ్ ఎల్స్‌.. ఈసినిమా కూడా స‌మ్‌థింగ్ ఎల్స్ అన్నారు`` అని అన్నారు.

కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధిస్తున్నందుకు ఆడియ‌న్స్‌ తోపాటు అభిమానులకు హ్యాట్సాఫ్ అంటూ అభివాదం చేశారు మహేష్. ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన న‌రేష్‌ కి థాంక్స్ చెప్పారు. ఆయ‌న ఈ క్యారెక్ట‌ర్‌ను చేస్తారా? అనుకున్నాను. కానీ ఒప్పుకున్నందుకు ధన్య‌వాదాలు అని అన్నారు. దేవీ శ్రీ రాకింగ్ మ్యూజిక్ ని .. వంశీ పైడిపల్లి ప్రతిభను మహేష్ కొనియాడారు.
Tags:    

Similar News