20 ఏళ్ల కెరీర్ లో 25 సినిమాలు చేశారు సూపర్ స్టార్ మహేష్. తన కెరీర్ ల్యాండ్ మార్క్ 25వ సినిమా చేశారు ఇప్పుడు. అందుకే తన 24 సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్ లోనూ కనిపించనంత ఎమోషన్ నేటి సాయంత్రం `మహర్షి` ప్రీరిలీజ్ ఈవెంట్ లో కనిపించింది. ఈ వేడుకలో మహేష్ మునుపటి కంటే కాస్తంత ఎక్కువే ఎగ్జయిట్ అయ్యారు. కీలక సమయంలో కొరటాల శ్రీమంతుడు- భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లతో ఆదుకోకపోయి ఉంటే? అన్న గతాన్ని మహేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పనిలో పనిగా తన కెరీర్ ఆద్యంతం తన విజయానికి బాటలు వేసిన దర్శకులందరికీ పేరు పేరునా గుర్తు చేసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పాతికేళ్లలో గుర్తు చేసుకోవాల్సిన దర్శకులెందరో.. అంటూ మహేష్ తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లను ప్రత్యేకంగా తలుచుకున్నారు. ముందుగా నన్ను పరిచయం చేసిన కె.రాఘవేంద్రరావు గారు.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. కృష్ణవంశీ గారు..మురారి చేశాను .. ఆయనకు థాంక్స్. నన్ను ఒక్కడు స్టార్ ని చేసింది.. ఆ సినిమా చేసిన గుణశేఖర్ కి ధన్యవాదాలు. ఫ్యామిలీ ఆడియెన్ కి చేరువ చేసిన సినిమా `అతడు`ని ఇచ్చింది త్రివిక్రమ్. నా లైఫ్ లో ఒక టర్నింగ్ దూకుడు- శ్రీనువైట్ల కు థాంక్స్. నాకు రెండు సార్లు లైఫ్ నిచ్చారు కొరటాల. శ్రీమంతుడు.. భరత్ అనే నేను .. చిత్రాలతో మలుపునిచ్చారు .. ఇప్పుడు 25వ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేను ఏ దర్శకుడిని పేరు పెట్టి పిలవను. తొలిసారి వంశీని పిలుస్తున్నా. నా చిన్న తమ్ముడు అని అనుకున్నా. నిజానికి అతడు కథ చెప్పినప్పుడు 10 నిమిషాలు కథ విని పంపించేద్దామనుకున్నాను.. రెండు సినిమాలు చేయాల్సి ఉంది. రెండేళ్లు పడుతుందేమో అన్నాను. నో ప్రాబ్లెమ్ సర్ .. రెండేళ్లయినా వేచి చూస్తానన్నారు. మీరు తప్ప నేను ఎవరినీ ఊహించుకోలేను అని అన్నారు. వేరొకరైతే కథ ఉంటే వేరే హీరోల దగ్గరకు వెళ్లిపోతారు. నాకోసం రెండేళ్లు వేచి చూశాడు... అని అన్నారు.
ఇతర టెక్నీషియన్ల గురించి మహేష్ మాట్లాడుతూ.. ఫైట్ మాస్టర్లు రామ్- లక్ష్మణ్ కథని అర్థం చేసుకుని ఫైట్స్ చేస్తారు. మా సినిమాలో అద్భుతమైన ఫైట్ ని కొరియోగ్రఫీ చేశారు. రాజు మాస్టార్ నా ప్రతి సినిమాకి టచ్ లో ఉంటారు. ఈ సినిమాకి సోలో కొరియోగ్రఫీ అందించడం హ్యాపీ. ఇక దేవీ నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవీ బ్యాక్ గ్రౌండ్ అంటే కూల్ గా ఉండొచ్చు.. అద్భుతమైన సంగీతం- ఆర్.ఆర్ ను అందించాడు. ఇక ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన అల్లరినరేష్‌కి థాంక్స్. సినిమాటోగ్రాఫర్ మోహనన్‌కి థాంక్స్. నా ముగ్గురు నిర్మాతలు అశ్వినీదత్-దిల్‌రాజు- పివిపికి థాంక్స్. నాకు చాలా ఇంపార్టెంట్ మూవీ. ఏం కావాలో దాన్ని సమకూర్చారు. ఈ 25 సినిమాల జర్నీలో ప్రేక్షకుల చూపించిన అభిమానానికి చెతులెత్తి దండం పెడుతున్నాను. ఈ అభిమానం.. ప్రేమ మరో పాతిక సినిమాలు.. 20 ఏళ్లు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.