కొడుకుని ఈఫిల్ ట‌వ‌ర్ ఎక్కించాడు!

Update: 2015-10-27 03:57 GMT
ఇప్పుడున్న న‌వ‌త‌రం హీరోల్లో ప‌ర్‌ ఫెక్ట్ ఫ్యామిలీ మేన్ ఎవ‌రంటే మొద‌ట మ‌హేష్ పేరే వినిపిస్తుంది. ఆయ‌న కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. షూటింగ్‌కి పేక‌ప్ చెప్ప‌గానే  స‌రాస‌రి ఇంట్లో వాలిపోతాడు. పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకొంటూ స‌ర‌దాగా గ‌డుపుతుంటాడు. షూటింగ్ మ‌ధ్య‌లో కానీ, త‌ర్వాత కానీ  కాస్త ఖాళీ దొరికిందంటే ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేస్తుంటాడు. సినిమాకి ముందు, సినిమా త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా విహారానికి వెళ్లొస్తుంటాడు మ‌హేష్‌. అక్క‌డ స్టార్ క‌నిపించ‌డు, ఇమేజ్ గుర్తుకు రాదు. స‌గ‌టు తండ్రిగా త‌న పిల్ల‌ల చిన్న చిన్న కోరిక‌ల్ని తీరుస్తూ గ‌డుపుతుంటాడు. అందులోనే బోలెడంత ఆనందాన్ని వెదుక్కొంటుంటాడు.

ఇటీవ‌ల చేసిన  శ్రీమంతుడు స‌క్సెస్ మ‌హేష్‌ కి చెప్ప‌లేనంత ఆనందాన్నిచ్చింది. అందుకే ఆ సినిమా త‌ర్వాత ఇప్ప‌టికే రెండు మూడుసార్లు టూర్‌ కి వెళ్లొచ్చాడు. తాజాగా ఆయ‌న ప్యారిస్‌ లో గ‌డుపుతున్నాడు. త‌న త‌న‌యుడు గౌత‌మ్‌ ని ఈఫిల్ ట‌వ‌ర్‌ ని ఎక్కించాడు. అక్క‌డ్నుంచి ఓ ఫొటో తీసి దాన్ని ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేశాడు. ఇది నా కొడుకుదైన ఓ రోజు అంటూ గౌత‌మ్ ఆనందాన్ని చూసి ముచ్చ‌ట‌డిపోయాడు మ‌హేష్. ఎప్పుడూ సినిమాలు, స‌క్సెస్‌ లు - ఫెయిల్యూర్‌ లు అంటూ ఆ దిశ‌గానే ఆలోచిస్తూ ఒత్తిడికి గుర‌య్యే క‌థానాయ‌కులంతా మ‌హేష్‌ లా ఫ్యామిలీకి స‌మ‌యం కేటాయిస్తూ, అన్ని విష‌యాలూ మ‌రిచిపోయి వాళ్ల‌తో ఆనందంగా గ‌డ‌ప‌డం చాలా అవ‌స‌రం అంటుంటారు ప‌రిశ్ర‌మ పెద్ద‌లు. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. తదుపరి మురుగదాస్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇలా వెంటవెంటనే సినిమాలు చేయాల్సి ఉంది కాబట్టి  షూటింగ్ మధ్యలో విరామాన్నే యూజ్ చేసుకుంటూ ఫారిన్ ట్రిప్పులు వేస్తున్నాడు.
Tags:    

Similar News