మ‌హేష్ కి అర్థ‌రైటిస్ చికిత్స‌నా?

Update: 2020-01-27 05:05 GMT
వ‌య‌సు తో పాటే వ‌చ్చే స‌మ‌స్య‌లు కొన్ని ఉంటాయి. నేటి ఆధునిక ఒత్తిళ్ల జీవితంలో.. ట్రెండీ నైట్ లైఫ్ స్టైల్ లో 30 ప్ల‌స్ లోనే యువ‌కుల‌కు కీళ్ల నొప్పులు (అర్థ‌రైటిస్) తప్ప‌డం లేదు. 40 దాటితే ఇక లేనిపోని స‌మ‌స్య‌లెన్నో మీద ప‌డుతున్నాయి. అందుకే ఆరోగ్యం విష‌యంలో ఎంతో ముందు చూపు త‌ప్ప‌ద‌న్న‌ది డాక్ట‌ర్ల సూచ‌న‌.

కానీ ఎవ‌రు పాటిస్తున్నారు. ఇక షూటింగులు హ‌డావుడి అంటూ తిరిగే స్టార్ల‌కు అయితే ఈ స‌మ‌స్య‌లు మ‌రీ ఎక్కువ‌. తార‌ల‌కు స‌మ‌యానికి తిన‌లేనంత బిజీ షెడ్యూల్స్ కూడా ఉంటాయి. ఈ త‌ర‌హా కార‌ణాల వ‌ల్ల ఆరోగ్యంగా క‌నిపిస్తున్నార‌ని భావించినా.. కీళ్ల నొప్పులు .. తుంటి నొప్పులు వెంటాడుతూ ఉంటాయి. ఇవి తెలియ‌ని స‌మ‌స్య‌లు. మోకాలి చికిత్స‌లు చేయించాల‌ని డాక్ల‌ర్లు చెప్పినా స‌ర్జ‌రీలు అంటే వాయిదాలు వేస్తుంటారు. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి కూడా అలాంటి స‌మ‌స్య‌నే వ‌చ్చిందా? ఏదో గాయం వ‌ల్ల నొప్పి వ‌స్తుందిలే అని లైట్ తీస్కుంటే ఏజ్ దృష్ట్యా అది కాస్తా అర్థ‌రైటిస్ (కీళ్ల మోకాళ్ల నొప్పులు) గా మారిందా? అంటూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌హేష్ వ‌య‌సు 44. ఇంకా టీనేజీ బోయ్ నే త‌ల‌పిస్తున్నా.. అర్థ‌ శ‌త‌కానికి ఇంకెంతో దూరంలో లేడు. అందుకే ఆరోగ్యం ప‌రంగా ఎంతో జాగ్ర‌త్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆగ‌డు స‌మయంలో అయిన మోకాలి గాయం కాస్తా ఇప్పుడు తిర‌గ‌బెట్ట‌డం ఇబ్బందిక‌రంగా మారింది. అప్పుడు లైట్ తీస్కోవ‌డం ఇప్పుడు ముప్పుగా మారింది. అయితే దీనికి శ‌స్త్ర చికిత్స చేయించి ప‌ర్మినెంట్ గా చెక్ పెట్టాలంటే ఐదే నెల‌ల గ్యాప్ త‌ప్ప‌నిస‌రి అని విశ్లేషిస్తున్నారు. అంటే గాయం తో పాటు అర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ ను పూర్తిగా త‌గ్గించుకునేందుకే ఈ చికిత్స సాగుతుంద‌ని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా మ‌హేష్ టీమ్ నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. సామాజిక మాధ్య‌మాల్లో ర‌క‌ ర‌కాలుగా ప్ర‌చారం అవుతోంది కాబ‌ట్టి న‌మ్ర‌త అండ్ టీమ్ సోష‌ల్ మీడియాలో అయినా వివ‌ర‌ణ ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News