మహేష్ బాబు కొత్త సినిమా అప్ డేట్ అనగానే.. అభిమానుల్లో వైరల్ అయిపోవడంలో ఆశ్చర్యం లేదు. కొన్ని రోజుల క్రితం కొరటాల శివ ఓ అప్ డేట్ ఇచ్చాడు. భరత్ అనే నేను చిత్రానికి విజన్ ను మార్చ్ 6న విడుదల చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ ను విడుదల చేశాడు.
దర్శకుడి నుంచి పోస్ట్ రావడం ఆలస్యం.. సూపర్ స్టార్ అభిమానులు అంతా తెగ హంగామా చేసేసుకున్నారు. కానీ అప్పుడు ఫ్యాన్స్ మిస్ అయిన పాయింట్ ఏంటంటే.. ఆ పోస్టర్ లో టైం లేదు. ఇప్పుడు 6వ తేదీతో పాటు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు లేటెస్ట్ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇందులో కూడా మహేష్ బాబు కొత్త స్టిల్ ఇచ్చారు. సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి కుర్చీ మీద చెయ్యేసి మహేష్ నుంచున్న పోస్టర్ సూపర్బ్ గా ఉంది. కొరటాల కచ్చితంగా కొత్త కంటెంట్ ఏదో చూపించబోతున్నాడనే కాన్ఫిడెన్స్ ను అయితే.. అభిమానుల్లో కలిగించడంలో విజయం సాధించారు భరత్ అనే నేను మేకర్స్. కానీ ఈ టైమింగ్ విషయంలోనే ఓ డౌట్ అభిమానులకు వస్తోంది.
మొదటి పోస్టర్ ఇచ్చినపుడే డేట్ తో పాటు టైం కూడా చెప్పేసి ఉండచ్చు కదా.. మళ్లీ ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు అని చెప్పేందుకు ఇంకో పోస్టర్ ప్లస్ అప్ డేట్ ఎందుకో అనుకుంటున్నారు. మరీ అంత అత్యాశ పనికి రాదు అభిమానులు.. మరి ఫ్రీగా ప్రమోషన్స్ ఎలా వస్తాయ్ చెప్పండీ.. అర్ధం చేసుకోరూ!మొత్తానికి టీజర్ కి ముందు.. ఆ ముందు.. అంతకు ముందు మాత్రమే కాకుండా.. మధ్యలో కూడా ఇలాంటి హంగామా చేయచ్చన్న మాట.