ప్రఖ్యాత మైనపు బొమ్మల మ్యూజియమ్ మేడమ్ టుస్సాడ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపుబొమ్మను చాలా రోజుల క్రితమే పెట్టారు. సింగపూర్ లో ఉన్న ఈ వ్యాక్స్ స్టాచ్యూను ఇండియాకు తీసుకొచ్చి మార్చ్ 25 నాడు హైదరాబాద్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతున్నారు. మహేష్ బాబుకు భాగస్వామ్యం ఉన్న ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపుబొమ్మను సందర్శన జరుగుతుంది. ఇదో అరుదైన సందర్భం కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎగ్జైట్ అయి ఉన్నారు.
కానీ ఇక్కడ ఒక అనుమానం చాలామంది మదిని తొలుస్తోంది. అదేంటంటే.. ఈ మైనపుబొమ్మ ప్రదర్శనకు టికెట్ కొనాల్సి ఉంటుందా లేక ఎవరైనా ఫ్రీగా చూడవచ్చా? ఎఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఉంది. మరి మాల్ లో కి వచ్చిన వారు ఎఎంబీ సినిమాస్ ఎంట్రెన్స్ వరకూ టికెట్ లేకుండా ఫ్రీగా వెళ్ళగలరు. ఒకవేళ సూపర్ స్టార్ మైనపు బొమ్మను ఎఎంబీ సినిమాస్ ఎంట్రెన్స్ లో పెడితే మాత్రం సందర్శకులు ఫ్రీగా చూడగలరు. కానీ మల్టిప్లెక్స్ లోపల మైనపుబొమ్మను పెడితే మాత్రం ఖచ్చితంగా టికెట్ కొంటేనే ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ మైనపు బొమ్మకోసం డైరెక్ట్ గా టికెట్ కొనకపోయినా.. మల్టిప్లెక్స్ లో ప్రదర్శిస్తున్న సినిమాల టికెట్ అయినా కొనాల్సిందే. ఈ విషయంపై ఆర్గనైజర్స్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
ఇక ఈ సందర్శన పూర్తయిన తర్వాత తిరిగి సింగపూర్ కు తీసుకెళ్తారట. అది సరేకానీ మహేష్ స్టాచ్యూ లో ఉన్న స్పెషాలిటీ తెలుసు కదా? ప్రభాస్ స్టాచ్యూ కూడా మేడమ్ టుసాడ్స్ లో ఉన్నప్పటికీ అది 'బాహుబలి స్టాచ్యూ'. కానీ మహేష్ విషయానికి వస్తే మహేష్ పోషించిన పాత్రకు సంబంధించినది కాదు.. స్వయంగా మహేష్ దే.