మహేష్ బాబు అనగానే మూడీగా.. ఎవరినీ కలవడానికి ఇష్టపడని షై పర్సనాలిటీలా కనిపించేవాడు ఒకప్పుడు. తన సినిమాల వేడుకలకు కూడా హాజరయ్యేవాడు కాదతను. కానీ నమ్రత అతడి జీవితంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. మహేష్ బాబు తీరే మారిపోయింది. సినిమాల ప్రమోషన్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడతను. దీంతో పాటే బోలెడన్ని బ్రాండ్లు ప్రచారకర్తగా మారాడు. సినిమాలతో సమానంగా వాణిజ్య ఒప్పందాల ద్వారా కూడా ఆదాయం ఆర్జించడం మొదలుపెట్టాడు. టాలీవుడ్లో చాలామంది హీరోలకు ఈ విషయంలో ఆదర్శంగా నిలిచాడు మహేష్. ఇప్పుడు మహేష్ బిజినెస్ మ్యాన్ గా కూడా మారుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మహేష్ అడుగుపెడుతున్నట్లు చెబుతున్నారు. వీళ్ల కొలాబరేషన్లో తెలుగు రాష్ట్రాల్లో 25 మల్టీప్లెక్సుల నిర్మాణం జరుగుతుందట. ఆల్రెడీ అందుబాటులో ఉన్న సింగిల్ స్క్రీన్లను తమ చేతుల్లోకి తీసుకుని వాటిని మల్టీప్లెక్సులుగా మార్చడంతో పాటు.. కొత్తగా కూడా నిర్మాణాలు చేపడతారట. ఈ బిజినెస్ లో మహేష్ ప్రత్యేకంగా చేసేదేం లేదు. జస్ట్ బ్రాండ్ అంబాసిడర్లా ఉంటాడు. ఏదైనా వ్యవహారాలుంటే నమ్రత చూసుకుంటుంది. మల్టీప్లెక్స్ బిజినెస్ అన్నది ఇప్పుడు లాభసాటిగా మారిన వ్యవహారం కాబట్టి మహేష్ ఇందులో కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయని.. ఆ తర్వాత అతను ఇలాంటి బిజినెస్ లు మరి కొన్ని టేకప్ చేసే అవకాశాలుంటాయని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/