ఫోటో స్టొరీ: రఫ్ఫాడిస్తున్న రాబ్తా సుందరి

Update: 2019-01-27 07:44 GMT
మహేష్ బాబు సినిమా '1 నేనొక్కడినే' ద్వారానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం.  ఆ సినిమా విజయం సాధించకపోయినా నాగచైతన్య తో 'దోచేయ్' లో కూడా అవకాశం వచ్చింది. అది కూడా అంతంతమాత్రం సినిమానే.   టాలీవుడ్ లో బ్రేక్ రాకవపోవడంతో  శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఎంచక్కా ఫ్లైట్ ఎక్కి ముంబైలో ల్యాండ్ అయింది.

అక్కడ ప్రస్తుతానికి కెరీర్ ఫరవాలేదు అన్నట్టుగా సాగుతోంది.  మధ్యలో ప్రేమాయణాలు కూడా సాగుతున్నాయి.  'రాబ్తా' షూటింగ్ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమలో పడిపోయిందని బాలీవుడ్ జనాలు కోడై కూసినా కృతి మాత్రం కన్ఫాం చేయలేదు. ఇప్పుడేమో ఇద్దరూ దాదాపుగా అంటీ ముట్టనట్టు ఉంటున్నారు.  ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో 17 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు.  హాటు ఫోటోలతో నెటిజనులపై అప్పుడప్పుడూ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ ఉంటుంది.

త్రోబ్యాక్ పిక్చర్ అంటూ 'రాబ్తా' షూటింగ్ సమయంలో తీసుకున్న ఒక ఫోటోను సరిగ్గా ఓ వారం క్రితం పోస్ట్ చేసింది. ఈ ఫోటోను  మీముందుకు తీసుకు రావడం లేట్ అయిందేమో గానీ ఆ ఫోటోలో అందం.. హాట్నెస్ ఏమాత్రం తగ్గలేదు. ఆలస్యం అమృతం విషం అంటుంటారు. కానీ ఈ ఫోటో మాత్రం ఆలస్యం అయినా అమృతంలాగే ఉంది.  జనసంచారం లేని రోడ్డుపై లాంగ్ ఐస్ బ్లూ కలర్ లాంగ్ డ్రస్ వేసుకుంది.  డ్రెస్ ఎంత అందంగా ఉందో డ్రెస్ లేకుండా ఉన్న మధ్యప్రదేశ్ రీజియన్ మరింత అందంగా ఉంది.  ఈ అమ్మడి హాట్నెస్ దెబ్బకు నెటిజనులు పిచ్చెక్కినట్టుగా 1.4 మిలియన్ లైక్స్ కొట్టారు. తప్పేమీ లేదు.. ఇలాంటి ఫోటో చూసి కూడా కూడా లైక్ కొట్టకపోతే వాడికి 'కలాపోసన' అసలు లేనట్టే. అలాంటి వేస్ట్ నెటిజనులు ఈ భూమ్మీద ఉంటేనేం పోతేనేం!

Tags:    

Similar News