రాజ‌మౌళి చెప్పాడ‌ని ఫ్యాన్స్ తెగ‌ వెతికేస్తున్నార‌ట‌!

Update: 2022-09-13 15:38 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల తొలి క‌ల‌యిక‌లో స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించిన 'RRR' ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన ఈ మూవీ పై విదేశీ ప్రేక్ష‌కులు, హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌, ఆర్టిస్ట్ లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డంతో రాజ‌మౌళి క్రేజ్ హాలీవుడ్ వ‌రకు చేరింది. ఈ మూవీతో గ్లోబ‌ల్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న రాజ‌మౌళి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని కూడా అదే స్థాయికి ఏ మాత్రం మించ‌కుండా తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

దీంతో రాజ‌మౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 'RRR' త‌రువాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ భారీ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై గ‌త కొన్ని నెల‌లుగా అభిమానుల్లో, టాలీవుడ్ వ‌ర్గాల్లోనూ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. 'RRR' తో వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపుని సొంతం చేసుకున్న రాజ‌మౌళి .. మ‌హేష్ తో చేయ‌బోతున్న సినిమాని పాన్ వ‌ర‌ల్డ్ అనే స్థాయిలో తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌.

దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ ఏ జోన‌ర్ లో వుంటుందా? అని గ‌త కొన్ని నెల‌లుగా ఆర‌కా తీస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా టోరంటో ఫిల్మ్ ఫెస్టివెల్ లో పాల్గొన్న రాజ‌మౌళి తాను మ‌హేష్ తో చేయ‌బోతున్న సినిమా ఏ జోన‌ర్ లో వుండ‌బోతోందో స్ప‌ష్టం చేశాడు.

యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా తెర‌పైకి రానున్న ఈ మూవీ 'గ్లోబ్ ట్రాటింగ్ యాక్ష‌న‌ప్ అడ్వెంచ‌ర్‌' గా వుంటుంద‌ని వెల్ల‌డించాడు. దీంతో ఆ ప‌దం అంటే ఏంటీ? .. సినిమా ఎలా వుండ‌బోతోంది? అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నార‌ట‌.

'గ్లోబ్ ట్రాటింగ్ యాక్ష‌న్‌ అడ్వెంచ‌ర్‌' అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి' చెందే అని అర్థం. ఈ ప‌దాన్ని బ‌ట్టే జ‌క్క‌న్న .. మ‌హేష్ తో చేయ‌బోయే మూవీ కోసం ఏరేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు. రాజ‌మౌళి చెప్పిన మాట‌ల‌ని బ‌ట్టి ముందు నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టుగా ఈ మూవీని ఆఫ్రికా అడ‌వుల నేప‌త్యంలో సాగే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా మూవీ వుంటుంద‌ని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News