మహేష్ ఫ్యాన్స్ కు గ్రేట్ న్యూస్!

Update: 2019-12-24 12:42 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11 న రిలీజ్ అవుతోంది.  దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ సాగుతున్నాయి. పోస్టర్లు.. టీజర్.. లిరికల్ సాంగ్స్ తో సినిమాపై వీలైనంతగా హైప్ పెంచుతున్నారు.  ఇక జనవరి 5 న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు తన అభిమానుల కోసం ప్రత్యేకంగా మూడు రోజుల పాటు ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశారట.

'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ కు ఈమధ్యే గుమ్మడికాయ కొట్టారు.  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరిదశలో ఉంది. దీంతో మహేష్ - అనిల్ రావిపూడి పూర్తిగా ప్రమోషన్స్ పై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారట.  సహజంగా మహేష్ బాబు తన సినిమాలకు ప్రచారం అనగానే ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలు మీడియా వారితో పంచుకుంటారు.  అయితే ఈసారి దాంతో పాటుగా అభిమానులను స్వయంగా కలవాలని డిసైడ్ అయ్యారట.   ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ఇతర ఫంక్షన్లలో అభిమానులను వ్యక్తిగతంగా కలిసే అవకాశం లేకపోవడంతోనే మహేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.

ఫ్యాన్స్ అసోసియేషన్ వారు రిఫర్ చేసిన అభిమానులను మహేష్ కలవడమే కాకుండా వారితో ముచ్చటించాలని.. ఫోటోలు తీయించుకునే అవకాశం కల్పించాలనే ప్లాన్ చేసుకున్నారట.  ఈ ఫ్యాన్ మీట్ లో కాలేజి స్టూడెంట్స్ నుండి పెద్దవారివరకూ అన్ని వయసుల అభిమానులను కలిసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట.  ఇది అభిమానులకు తప్పనిసరిగా ఒక గ్రేట్ న్యూస్ అనే చెప్పాలి.

    

Tags:    

Similar News