మహేష్ కి మళ్లీ నెల రోజులు కష్టాలే
మహేష్ బాబు లేటెస్ట్ మూవీని క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. శరవేగంగా జరపాలని అనుకున్న ఈ మూవీ షూటింగ్ మెల్లగా సాగుతోంది. జనవరి చివరకే షూట్ మొత్తం పూర్తి చేయాలని అనుకున్నా ఇంకా చాలా భాగం పెండింగ్ ఉంది.
ఇప్పుడు మహేష్ బాబు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ తోపాటు ముంబైలో షూటింగ్ కోసం బయల్దేరుతున్నాడు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ జరగనుందట. టెర్రరిస్టులకు.. యాంటీ టెర్రరిజం వింగ్ కు మధ్య సాగే పోరాటాన్ని ఉత్కంఠ కలిగించేలా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ కలిపి ఏకంగా నెల రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు మురుగ అండ్ మహేష్. గతంలో కూడా అహ్మదాబాద్ లో నెల రోజులు క్యాంప్ వేసిన మహేష్ అండ్ టీం.. ఇప్పుడు మరో ముప్ఫై రోజులు యాక్షన్ దృశ్యాలే చిత్రీకరించనున్నారు.
డయ్యులో టెంపరేచర్.. హ్యుమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో యాక్షన్ ఎపిసోడ్స్ అంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. అయినా సరే.. షూట్ మాత్రం ఆగకుండా ప్లాన్ చేయడం విశేషం. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక.. మరో రెండు పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/