బయటకు వచ్చాక ఆమెకు చుక్కలే

Update: 2017-08-21 10:45 GMT
ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. అసలు బిగ్ బాస్ కార్యక్రమంలో గడిపే సమయంలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో పక్కనెడితే.. బయటకొచ్చాక మాత్రం అందరూ తమ తమ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వచ్చిన తరువాత ఇచ్చే ఇంటర్యూలో ఇతర సెలబ్రిటీల గురించి మనోళ్లు చేసే కామెంట్లన్నీ కూడా కాస్త సెన్సేషనల్ అయిపోతున్నాయి. బిగ్ బాస్ లోకి రావడానికి ముందు ఈ సెలబ్రిటీలకు పెద్దగా హైప్ ఏమీ లేదుగాని.. ఒక్కసారి షో నుండి ఎలిమినేట్ అయ్యాక మాత్రం.. వీళ్ళ మాటలన్నీ న్యూసులే అయ్యాయ్.

బిగ్ బాస్ నుండి ఈ మధ్యనే ఎలిమినేట్ అయిన కత్తి మహేష్‌ అని ఫిలిం క్రిటిక్ ఇప్పుడు అదే తరహాలో కామెంట్లు చేస్తున్నాడు. అసలు బిగ్ బాస్ షో అంతా అయిపోయాక.. హీరోయిన్ అర్చన పరిస్థితి చాలా కష్టంగా ఉంటుందని మనోడు కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనం అయిపోయింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఆమె ఎవ్వరితోనూ ఫ్రెండ్లీగానే ఉండదని.. అది ప్రజలందరూ చూస్తున్నారని.. అలా చేసి బయటకు వస్తే నిజం జీవితంలో ఆమెకు స్నేహితులు మిగలరు.. వచ్చే అరకొరా సినిమా ఛాన్సులు కూడా మిగలవ్ అంటూ కామెంట్ చేశాడాయన. ఒక్కసారిగా అర్చన అంటే కొద్దోగొప్పో అభిమానం ఉన్నవారు ఈ కామెంట్లు విని ఖంగారుపడటం ఖాయం.

ఇదంతా ఒకెత్తయితే.. బిగ్ బాస్ లో జరిగిన అనుభవాలతో మనోడు ఇప్పుడు ఒక పుస్తకం రాస్తున్నాడట. అసలు బిగ్ బాస్ అనే షోలోకి కేవలం సెలబ్రిటీలను తీసుకుంటున్నప్పుడు.. ఆ షో గురించి లోకానికి జ్ఞానం అందించేద్దాం అని బుక్ రాయడం వలన ఏమన్నా ఉపయోగం ఉంటుందా? సర్లేండి ఎవరి ఐడియాలు వారివి!!
Tags:    

Similar News