త్రివిక్ర‌మ్ తో పాన్ ఇండియా ట్ర‌య‌ల్ కాదా?

Update: 2022-10-07 09:30 GMT
తెలుగు సినిమా ప‌య‌నం పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ వైపు సాగుతోంది. ఎంపిక చేసుకునే క‌థ‌లు పాత్ర‌లు యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో లార్జ‌ర్ దేన్ లైఫ్ యాటిట్యూడ్ తో బాక్సాఫీస్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నాయి. ప్ర‌భాస్ - చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్- ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స‌హా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా కంటెంట్ పైనే దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా రాజ‌మౌళితో పాన్ ఇండియా మార్కెట్లో పాగా వేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

కానీ అంత‌కుముందే త్రివిక్ర‌మ్ తో కూడా మ‌హేష్ పాన్ ఇండియా సినిమానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 15న ప్రారంభం కానుంది.

కానీ ఇందులో మ‌హేష్ లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లో క‌నిపించ‌రు. ఈ సినిమాలో మహేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని సమాచారం.

ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా.. త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ డైలాగుల‌తో కొన‌సాగుతుంది. మ్యూజిక‌ల్ గాను మ్యాజిక్ చేసేందుకు థ‌మ‌న్ ని ఎంపిక చేసుకున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. పాపుల‌ర్ స్టార్ల‌ను కీలక పాత్రల కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ ఆలోచ‌నా విధానం చూస్తుంటే అత‌డు మ‌రోసారి అల వైకుంఠ‌పుర‌ములో .. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర‌హాలో ఫ్యామిలీ డ్రామాతోనే మ్యాజిక్ చేయాల‌ని భావిస్తున్నారు.

మ‌హేష్ లాంటి ఛ‌రిష్మా ఉన్న హీరోకి అత‌డి బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ క‌థాంశాన్ని త్రివిక్ర‌మ్ ఎంచుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ మూవీలో మ‌హేష్ గెట‌ప్ ని పూర్తిగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవ‌లే మ‌హేష్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీకైన సంగ‌తి తెలిసిందే. లాంగ్ హెయిర్.. టోన్డ్ బాడీతో అత‌డు స్పెష‌ల్ గా క‌నిపించాడు. అత‌డు-ఖలేజా త‌ర్వాత ఈ కాంబినేషన్ నుంచి వ‌స్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచ‌నాలేర్ప‌డుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News