రియాల్టీ షోకి ముద్దుల త‌న‌య‌తో మ‌హేష్‌!

Update: 2022-08-29 09:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముద్దుల త‌న‌య సితార‌తో ఓ రియాల్టీ షోకి గెస్ట్ గా హాజ‌ర‌వుతున్నారా? అంటే అవున‌నే వినిపిస్తుంది. ఇంత‌కీ మ‌హేష్ హాజ‌ర‌వుతోన్న ఆ రియాల్టీ షో ఏది అంటే..వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.  పాపుల‌ర్ హిందీ రియాల్టీ డాన్స్ షో  డాన్స్ ఇండియా డాన్స్ ఎంత ఫేమ‌స్ అన్న‌ది తెలిసిందే. ఇటీవ‌లే తెలుగులో కూడా ఇదే షోని  జీటీవీ ప్ర‌సారం చేస్తుంది.

తాజా ఎపిసోడ్ కి అతిధులుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌...సితార‌ని అతిధులుగా నిర్వాహ‌కులు ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఈ షోకి సంబంధించి ఇప్ప‌టికే ఇద్ద‌రి పై షూట్ సైతం పూర్తిచేసిన‌ట్లు స‌మాచారం. ఈ షోలో కంటెస్టెంట్ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే? మ‌హ‌ష్‌..సితార ఎంట్రీతో  షో ఎంత‌గా  పాపుల‌ర్ అవుతుంద‌న్న‌ది  చెప్పాల్సిన ప‌నిలేదు.

మ‌హేష్ ఎంట్రీతో ఛాన‌ల్ టీఆర్పీ రేంటింగ్ అమాంతం ఛేంజ్ అవ్వ‌డం ఖాయం. అదీ తొలిసారి సితార‌తో క‌లిసి ఇలా ఓ డాన్స్ షోకి మ‌హేష్ హాజ‌ర‌వ్వ‌డం ఇదే తొలిసారి. సాధార‌ణంగా  మ‌హ‌ష్ త‌న సినిమాలు రిలీజ్ స‌మ‌యంలో మినహా మీడియాలో ఎక్క‌డా క‌నిపించ‌రు. టీవీషోల‌కు అస్స‌లు హాజ‌రు కారు. అప్పుడెప్పుడో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హాస్ట్ గా చేసిన ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు  గేమ్ షోకి మ‌హేష్ హాజ‌ర‌య్యారు.

ఆ త‌ర్వాత గానీ..అంత‌కు  ముందుగానీ  ఎలాంటి  గేమ్ షోకు మ‌హేష్‌ హాజ‌రైంది లేదు. ఈ నేప‌థ్యంలో 'డాన్స్  ఇండియా డాన్స్'  కి  మ‌హేష్ అటెంట్  అవ్వ‌డంపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కుంది. ఫాద‌ర్-డాట‌ర్ ఇద్ద‌రు అభిమానుల్ని ఎలా  ఆక‌ట్టుకుంటారు? అన్న ఉత్సాహం ఫ్యాన్స్ లో అప్పుడే మొద‌లైపోయింది.

అయితే ఈ విష‌యాన్ని నిర్వాహ‌కులు ఇంకా ధృవీక‌రించ‌లేదు. ఈ షోని అకుల్ బాలాజీ హోస్ట చేస్తున్నారు.  బాబా భాస్క‌ర్.. సంగీత.. ఆనంది జ‌డ్జ్ లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక మ‌హేష్  త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ రెండ‌వ వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని సమాచారం. వాస్త‌వానికి ఇప్ప‌టికే షూట్ ప్రారంభం కావాలి. కానీ టాలీవుడ్  బంద్ స‌హా వివిధ కారణాల‌తో డిలే అయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News