సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ చిత్రం మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇక మహేష్ 27 చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ చిత్రం స్టోరీ కి సంబంధించి పలు వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఇండ్రస్టీ నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇదో గ్యాంగ్ స్టర్ స్టోరీగా తెలుస్తోంది. మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలో మహేష్ బాబు పూర్తిగా గ్యాంగ్ స్టర్ పాత్రలో కాకుండా కొంత మేరకు లెక్చరర్ పాత్రలో కూడా కనిపిస్తాడట. గ్యాంగ్ స్టర్ గా మహేష్ బాబు కనిపించేది గంట సమయం అంటూ మరికొందరు అంటున్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రలో మహేష్ బాబు ఓ రేంజ్ లో ఉంటాడని అంచనాలు పెంచేస్తున్నారు.
గతంలో వచ్చిన పలు గ్యాంగ్ స్టర్ చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా హీరో ఫ్ల్యాష్ బ్యాక్ ను కలిగి ఉంటాడని అంటున్నారు. అయితే ఇది గతంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. మహేష్ బాబు కెరీర్ లో మరో నిలిచిపోయే సినిమాను వంశీ పైడిపల్లి తీయబోతున్నాడంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.