సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ సెట్స్ లోకి వచ్చేస్తున్నారా?.. ఇక రోల్ .. కెమెరా యాక్షన్ అనే సందడి మహేష్ మూవీకి వినిపించబోతోందా? అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. 2022 హీరో మహేష్ బాబుకు అత్యంత దారుణమైన మర్చిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది. తన సోదరుడు రమేష్ బాబు అకాల మరణంతో మహేష్ బాబు లైఫ్ లో విషాదాలు ఒక్కొక్కటిగా వెంటాడటం తెలిసిందే.
రమేష్ బాబు చనిపోయిన విషాదం నుంచి తేరుకునే లోనే మహేష్ తల్లిగారైన శ్రీమతి ఇందిరా దేవి మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ఆ మరణం నుంచి మహేష్ తేరుకుంటున్నాడని అనుకుంటున్న తరుణంలో మహేష్ ఫాదర్, సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మాత్తుగా మృతి చెందడంతో మహేష్ బాబు, ఆయన ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. వరుగా తనకు పెద్దదిక్కుగా వున్న వారు మృతి చెందడంతో మహేష్ బాబు కూడా తీవ్ర ఆవేదనకు గురికావడం తెలిసింది.
ఇలా ఒకే ఏడాది సోదరుడు, తల్లి, తండ్రి.. ఇలా ముగ్గరిని కోల్పోవడంతో హరీఓ మహేష్ బాబు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని సన్నిహిత వర్గాల్లో వినిపిస్తోంది. నలుగురు కలిసిన సమయంలో ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని.. ఒంటరిగా వున్న సమయంలో మాత్రనం మహేష్ చాలా భావోద్వేగానికి లోనవుతున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మహేష్ ఇంట్లో వుండటం కంటే సెట్ లో అందరి మధ్య వుండమే మంచిదని, అలా చేయడం వల్ల తను మామూలు మనిషి అవుతాడని అంతా అంటున్నారట.
తాజా పరిణామాల నేపథ్యంలో త్రివిక్రమ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ని డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలు పెడితే బాగుంటుందని మహేష్ సన్నిహితులు భావిస్తున్నారట. మహేష్ కూడా ఇందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. SSMB 28 ప్రాజెక్ట్ ని మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్లాన్ మార్చి స్క్రిప్ట్ ని కూడా మార్చిన విషయం తెలిసిందే.
కొత్తగా మార్చిన స్క్రిప్ట్ ప్రకారం కీలక పాత్ర కోసం శోభనని ఎంపిక చేసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా నటీనటులు, టెక్నీషియన్ లు అంతా సేమ్ అని.. రెగ్యులర్ షూట్ కి అంతా రెడీగా వుందని.. మహేష్ సెట్ లోకి ఎంటర్ కావడమే ఆలస్యం అని.. రోల్ కెమెరా..యాక్షన్ అంటే త్రివిక్రమ్ దూకుడుగా సినిమా షూటింగ్ ని పరుగులు పెట్టిస్తారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.