'పుష్ప' పార్ట్-2 మాత్రం ఇంత టైట్ గా ఉండదు: మైత్రీ నిర్మాతలు

Update: 2021-12-18 14:31 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''పుష్ప: ది రైజ్'' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని - రవి శంకర్ - మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ మీడియాతో మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

'పుష్ప' సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 70 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని.. ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సెలబ్రేషన్స్ మోడ్ లో ఉన్నామని.. త్వరలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తామని అన్నారు. శుక్రవారం రిలీజ్ ఉంటే బుధవారం - గురువారం సెన్సార్ చేశామని.. ఓవర్ సీస్ లో ప్రింట్స్ టైట్ అయ్యాయని తెలిపారు. టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్న మేకర్స్.. అందుకే మలయాళ వెర్షన్ ను ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేశామని చెప్పారు.

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం బిగ్ ఛాలెంజ్ అని.. విడుదలకు మూడు నాలుగు రోజుల ముందు కూడా సాంకేతిక బృందం అంతా డే అండ్ నైట్ వర్క్ చేసారని తెలిపారు. ‘పుష్ప’ హిందీ వెర్షన్ సెన్సార్ రెండు రోజులు ముందు పూర్తి చేసి బాలీవుడ్ లో ఈవెంట్ చేసి ఉంటే.. తొలి రోజు రెట్టింపు వసూళ్లు వచ్చి ఉండేవని బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ గోల్డ్ మైన్ ఫిలిమ్స్ వారు తెలిపినట్లు నిర్మాతలు వెల్లడించారు.

''పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలల్లో మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకటి మాత్రం చెప్పగలం.. ఇంత టైట్ గా ఐతే ఉండదు. షూటింగ్ - ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత, రెండు నెలల ముందు రిలీజ్ డేట్ ఇస్తాం. ఇతర భాషల్లో మార్కెట్ చాలా ఇంపార్టెంట్. అందుకే అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం'' అని మైత్రీ నిర్మాతలు తెలిపారు.
Tags:    

Similar News