చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమే!

Update: 2019-04-09 05:11 GMT
అక్కినేని నాగ చైతన్యకు వరసగా తగులుతున్న ఫ్లాపుల నుండి 'మజిలీ' పెద్ద రిలీఫే ఇచ్చింది. ఒక్క చైతుకు మాత్రమే కాదు.. అక్కినేని హీరోలందరూ వరస ఫెయిల్యూర్లతో సతమతమవుతూ ఉండడంతో ఈ విజయం అక్కినేని ఫ్యామిల్యీకి.. ఫ్యాన్స్ కు ఎంతో అనందాన్నిచింది.  ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే  17 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. 'మజిలీ' థియేట్రికల్ రైట్స్ ను 21 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది.  సోమవారం వసూళ్ళ వివరాలు ఇంకా రాలేదు.. సోమవారానికి కష్టం కానీ మంగళవారానికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అసలే సరైన సినిమాలు లేక ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో 'మజిలీ' రిలీజ్ కావడం భారీ అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది.  సినిమాకు మంచి టాక్ రావడం ఒక ఎత్తైతే.. సమ్మర్ హాలిడేస్.. పోటీలో వేరే సినిమాలు లేకపోవడం 'మజిలీ' ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి.  'రారండోయ్ వేడుక చూద్దాం' దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేసి  చైతు కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 'మజిలీ' జోరు చూస్తుంటే ఆ మార్కును అవలీలగా దాటేసేలా ఉంది.  అంతే కాదు ఈ సినిమా ముప్పై కోట్ల మార్కును టచ్ చేయడం కూడా సాధ్యమేననే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

'F2' తర్వాత ఏదో ఒకటి అరా సినిమాలు తప్ప ఈ ఏడాదిలో హిట్లు లేవని అనుకుంటున్న సమయంలో 'మజిలీ' ఆ లోటును తీర్చేసింది..  అంతే కాదు. సమ్మర్ సీజన్ ను సూపర్ గా ప్రారంభించిందని.. సమ్మర్ సీజన్ లో రానున్న సినిమాలు కూడా టాలీవుడ్ ను కళకళలాడేలా చేయడం ఖాయమేననేని అంటున్నారు.  


Tags:    

Similar News