ప్రేక్షకుల మైండ్ సెట్ ని మార్చేయడమే ధ్యేయంగా డిజిటల్ వరల్డ్ బరిలో దిగుతోందా? అంటే అవుననే తాజా పరిణామం చెబుతోంది. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ .. హాట్ స్టార్ లాంటి డిజిటల్ దిగ్గజాలు సినిమాల్ని నేరుగా మొబైల్ యాప్ లోకే తెచ్చేస్తుండడంతో ఆ మేరకు థియేటర్లలో ఆడే సినిమాకి బిగ్ పంచ్ పడిపోతోంది. ఒకప్పుడు రెండో రిలీజ్ మూడో రిలీజ్ అంటూ థియేటర్లలోనే ఆడించేవారు. కానీ ఆల్టర్నేట్ గా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు నేరుగా స్మార్ట్ ఫోన్- స్మార్ట్ టీవీల్లోకి తెచ్చేస్తుండడంతో ఆ పంచ్ మామూలుగా లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే హీరో కం నిర్మాత కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో డిజిటల్ స్ట్రీమింగ్ విధానంపై షాక్ కి గురై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సినిమా రిలీజైన నెలరోజుల్లోనే డిజిటల్ వేదికపై సినిమాలు రిలీజైపోతుంటే నిర్మాతలకు నష్టమే కదా.. ఈ విధానం మారాలని ఆయన అన్నారు. కనీసం 60 రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ ఫర్వాలేదు కానీ.. నెలరోజుల్లోనే అనేది ఇబ్బందికరమేనని అభిప్రాయపడ్డారు. ఆయనలా ఎందరో కలతకు గురవ్వడం చర్చకొచ్చింది.
ఆ క్రమంలోనే నిర్మాతల మండలిలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగింది. అటుపై అమెజాన్ సహా డిజిటల్ కంపెనీలకు హక్కులు కట్టబెట్టినా.. 60రోజుల తర్వాతనే రిలీజ్ చేయాలన్న రూల్ ప్రతిపాదనకు వచ్చింది. అయితే తాజాగా నాగచైతన్య- సమంతల `మజిలీ` సినిమాని కేవలం రిలీజైన నెలరోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లైవ్ చేయడం పెను ప్రకంపనాలకు తావిస్తోంది. ఇంకా థియేటర్లలో ఆడుతోంది.. ఈలోగానే అమెరికాలో అమెజాన్ డిజిటల్ రిలీజ్ చేసేసింది. ఈనెల 10 నుంచి ఏపీ- తెలంగాణలో `మజిలీ` అమెజాన్ ప్రైమ్ లో లైవ్ కానుందని అధికారికంగా ప్రకటించింది సదరు సంస్థ.
అయితే ఇది అమెజాన్ దుస్సాహసం.. దుశ్చర్య అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా రిలీజ్ చేస్తే నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్.. ఎగ్జిబిటర్. ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే డిజిటల్ రిలీజ్ ఏంటి? అన్న వాదనా వినిపిస్తోంది. 60 రోజులు రిలీజ్ చేయకూడదని డిజిటల్ పై ఆంక్షలు ఉన్నా ఇలా చేసిందేంటి అమెజాన్? అంటూ రచ్చవుతోందిప్పుడు. ఇంతకీ దీనిపై నిర్మాతల మండలి- ఫిలింఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. అసలింతకీ తెలుగు సినీనిర్మాతల మండలి కొత్త రూల్ ఇంకా అమల్లో లేదా? పొరపాటు ఎక్కడ జరిగింది? అన్నది నిర్మాతలే ప్రకటించాల్సి ఉంది.