శేష్ గత చిత్రాల కంటే 5 రెట్లు ఓపెనింగ్స్ రాబట్టిన 'మేజర్'

Update: 2022-06-04 06:31 GMT
టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన "మేజర్" సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ బయోపిక్ కు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల నుండి సానుకూలమైన రివ్యూలు అందుకుంది.

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా "మేజర్" చిత్రాన్ని తెరకెక్కించారు. రియల్ హీరో జీవితాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.

'మేజర్' సినిమా హీరో అడివి శేష్ కు బిగ్గెస్ట్ ఓపెనర్ గా.. ఆయన కెరీర్ లో అతి పెద్ద విజయంగా నిలవనుంది. బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి థ్రిల్ కు గురైన శేష్.. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. తనకు అండగా నిలిచిన నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

"మేజర్ మూవీ నేను ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే 5 రెట్లు ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది. మహేష్‌ బాబు సర్‌ సపోర్ట్‌ 50 రెట్లు ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తి దీన్ని 100 రెట్లు మరింత అర్థవంతంగా మార్చింది" అని శేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీకి తెరతీసిన 'మేజర్'.. మౌత్ టాక్‌ తో ఇండియా వైడ్ స్ట్రాంగ్ గా నిలబడింది. తాజా నివేదికల ప్రకారం ఈ బయోపిక్ 4.10 కోట్ల రూపాయల షేర్ వసూళ్లతో.. 6 కోట్లకు పైనే గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు హిందీ మలయాళ భాషల్లో విడుదలై ఈ సినిమా.. ఓవర్సీస్ లోనూ గట్టి ప్రభావం చూపిస్తోంది.

'మేజర్' మూవీ గురువారం ప్రీమియర్ల నుండి $270,403 (రూ. 2.10 కోట్లు) వసూలు చేసింది. ఇక శుక్రవారం 328 లొకేషన్స్ నుండి $207,248 కలెక్షన్లు సాధించింది. ట్రెండ్ ని బట్టి పూర్తి వివరాలు వెలువడిన తర్వాత ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్‌ ను చేరుకునే అవకాశం ఉంది.

'మేజర్' హిందీ బెల్ట్ కలెక్షన్స్ ఇంకా తెలియాల్సి ఉంది. బాలీవుడ్ విమర్శకులు సైతం సానుకూల సమీక్షలతో ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దీనికి తగ్గట్టుగానే కలెక్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాలో "మేజర్" బుకింగ్స్ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగుతుందని అంచనా వేయొచ్చు.

"మేజర్" చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించారు. సందీప్ పాత్రలో ఒదిగిపోయిన శేష్.. సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు. శోభిత ధూళిపాళ్ల - సయీ మంజ్రేకర్ - ప్రకాశ్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ - ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు కలిసి ఈ పాన్ ఇండియా బయోపిక్ ని నిర్మించాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు పాటలకు ఆదరణ లభిస్తోంది.

ముఖ్యంగా శ్రీ చరణ్  యాక్షన్ బ్లాక్‌ లకు బీజీఎమ్ కంపోజ్ చేసిన విధానం అత్యున్నతమైనది. అందరి హృదయాలను గెలుచుకుంది. అడివి శేష్ - శశి కిరణ్ తిక్కా తర్వాత 'మేజర్‌' క్రెడిట్‌ శ్రీచరణ్ కు దక్కుతుందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశముంది.
Tags:    

Similar News