విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. 2019లో విడుదలైన సూపర్ డూపర్ హిట్ 'ఎఫ్ 2'కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న 'ఎఫ్ 3'చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
భారీ అంచనాల నడుమ మే 27న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కథేమి పెద్దగా లేకపోయినా.. సినిమా మొత్తాన్ని కామెడీ సీన్లతో నింపేశారు. కావాల్సినంత వినోదాన్ని పంచుతుండటంతో ఆడియెన్స్ ఈ మూవీకి బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు. దీంతో వెంకీ-వరుణ్ లు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతున్నారు.
తొలి వారం రూ. 48.17 కోట్ల షేర్, రూ. 80.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సమ్మర్ సోగ్గాళ్లకు.. రెండో వారంలో మాత్రం 'మేజర్' టెన్షన్ పట్టుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మల్టీ ట్యాలెంటెడ్ అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రమే 'మేజర్'. 2008 లో 26/11 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. జూన్ 3వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సైతం నిన్ననే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.
దీంతో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ రెండు భారీ చిత్రాల మధ్య 'ఎఫ్ 3' ఎంత వరకు నిలబడుతుంది..? ఒకవేళ నిలబడినా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుందా..? అన్న ప్రశ్నలే వెంకీ, వరుణ్ అభిమానులను కలవర పెడుతున్నాయి. కాగా, రూ. 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సమ్మర్ సోగ్గాళ్లు.. రెండో వారంలో ఏ మేర కలెక్షన్స్ ను రాబడతారో చూడాలి.