మేజర్ సందీప్ నన్నిలా మార్చాడు: అడివి శేష్

Update: 2022-06-07 10:34 GMT
'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితచరిత్ర ఆధారంగా 'మేజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెరపై సందీప్ తప్ప తాను కనపడకూడదనే ఉద్దేశంతో అడివి శేష్ చాలా కసరత్తు చేశాడు. సందీప్ అలవాట్లను .. అభిరుచులను  తెలుసుకోవడానికిగాను ఆయన పేరెంట్స్ తో ఎక్కువ రోజులు గడిపాడు. ఈ సినిమా విడులయ్యేంతవరకూ వాళ్లతోనే అడివి శేష్ జర్నీ కొనసాగింది. సినిమాకి హిట్ టాక్ రాగానే ముందుగా ఆయన సందీప్ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాడు. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో సందీప్ పాత్రలోకి తన ట్రాన్స్ ఫర్మేషన్ ఎలా జరిగిందనేది చెబుతూ అడివి శేష్ ఒక వీడియో వదిలాడు. ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు 'మేజర్ బిగినింగ్స్' అని ఒక వీడియోను చేశాను.

నేను 'మేజర్' రోల్ చేయబోతున్నాను .. ఈ జర్నీ ఎలా ఉండబోతోంది .. నా హోప్స్  అండ్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఒక వీడియో రిలీజ్ చేశాను.  రెండున్నర గంటల సినిమా కోసం .. రెండున్న సంవత్సరాలు కష్టపడ్డాము.  

లైఫ్ ను ఆయన చూసిన తీరు నాకు నచ్చింది. అందరూ బాగుండాలి ..ఆ తరువాతనే నా గురించి ఆలోచిస్తా అనేది ఆయన ఉద్దేశం. యానిమల్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన  ప్రతి ఒక్కరినీ ప్రేమించేవారు. ఆయన స్పిరిట్ ను క్యాప్చర్ చేయడానికి నాకు ఎదురైన ఫస్టు టాస్క్ ఫిజికల్.నేను లెఫ్ట్ హ్యాండెడ్ ..ఆయన రైట్ హ్యాండెడ్. ఆయన నిలబడే తీరు ప్రత్యేకంగా ఉండేది. ఆయన నడిచే విధానం చాలా ఎలెర్ట్ గా ఉండేది. ఆయన మూవ్ మెంట్ లో ఒక గ్రేస్ ఉండేది.ఈ వీడియోస్ చూసినప్పుడు నాకు అర్థమైంది .. నేను ఆయనలా అస్సలు కాదని.

అక్కడి నుంచి నన్ను నేను మార్చుకోవలసి వచ్చింది. ఆయనే స్క్రీన్ పై కనిపించేది అన్నంతగా నేను నమ్మించగలగాలి .. అదే నా గోల్. ఆయన నవ్వుకి .. నా నవ్వుకి గల తేడా ఏమిటనేది నాకు వాళ్లమ్మ గారు చెప్పారు. నిజంగానే ఆయన నవ్వు చాలా ఓపెన్ గా ఉండేది. ఆయన మైండ్ సెట్ ను అర్థం చేసుకోవడానికి నాలో నేను ఒక ఎమోషనల్ ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకోవలసి వచ్చింది.

ఆయన కారణంగా ఆ రోజున 130 .. 140 మంది సేవ్ అయ్యారు. డైరెక్ట్ గా ఓ 15 మందిని రక్షించారు. రియల్ లైఫ్ లో నేను మేజర్ సందీప్ ను కాలేకపోవచ్చు .. కానీ ఆయన పేరెంట్స్ కి రియల్  లైఫ్ లో సెకండ్ సన్ కాగలను.వాళ్ల లైఫ్ అంతా నేను ఉండగలను. మేజర్ సందీప్ రోల్ కోసం నన్ను నేను ఎలా మార్చుకున్నాను అని కాదు .. ఆయన నన్ను ఎలా మార్చారు అని చెప్పడం కోసమే ఈ వీడియో" అంటూ చెప్పుకొచ్చాడు.

Full View

Tags:    

Similar News