టాలెంటెడ్ హీరో అడవి శేష్ టైటిల్ రోల్ లో 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ''మేజర్''. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు(జీఎంబీ ఎంటర్టైన్మెంట్) మరియు ఏ+ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో జులై 2న విడుదల కానున్న 'మేజర్' సినిమాకు సంబంధించిన టీజర్ ను మార్చి 28న గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
డైరెక్టర్ శశి కిరణ్ తిక్క కుటుంబంలో జరిగిన ఓ విషాద సంఘటన కారణంగానూ, దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుతున్నందు వల్ల ఈ నెల 28న ముంబైలో జరపాలనుకున్న 'మేజర్' టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అడవి శేష్ ట్వీట్ చేస్తూ.. నేషనల్ సినిమా కోసం గ్రాండ్ గా నేషనల్ ఈవెంట్ జరపాలని అనుకున్నామని, అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని.. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ ను తెలియజేస్తానని పేర్కొన్నారు. 'ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్..' అని మిగతాది మీకు అర్థమై ఉంటుంది కదా అంటూ 'పోకిరి' సినిమాలోని డైలాగ్ ను కోట్ చేసాడు.