మాస్ మహారాజ్ రవితేజ - దర్శకుడు గోపీచచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన 'క్రాక్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రం అనేక పరిణామాల తర్వాత జనవరి 9న సెకండ్ షో సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టిన 'క్రాక్' 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందని తెలుస్తోంది.
ఇకపోతే 'క్రాక్' డిజిటల్ రైట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ - మై హోమ్ గ్రూప్ రామ్ ఆధ్వర్యంలో నడిచే 'ఆహా' యాప్ ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'క్రాక్' సినిమాను జనవరి 29న 'ఆహా'లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు.
అయితే ప్రస్తుతం 'క్రాక్' సినిమా 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ లో కాసులు కురిపిస్తున్న ఈ చిత్రాన్ని ఇప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయడం ఎందుకని భావించిన అల్లు అరవింద్ - మై హోమ్ రామ్.. థియేటర్లకు మద్దతిస్తూ 'క్రాక్' సినిమా డిజిటల్ రిలీజ్ వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
మరో వారం రోజులు డిజిటల్ రిలీజ్ ని వాయిదా వేస్తే థియేట్రికల్ బిజినెస్ కి కూడా హెల్ప్ అవుతుందని ఆలోచించి 'ఆహా' టీమ్ 'క్రాక్' విడుదలను ఫిబ్రవరి 5కు పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే దీని వల్ల మరో వారం పాటు థియేటర్స్ కి రాబడి వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నిర్వహిస్తూ కూడా థియేటర్స్ కి సపోర్ట్ గా 'ఆహా' టీమ్ ఈ డెసిషన్ తీసుకోవడం పట్ల సినీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.