భాగమతి సౌండ్ కూడా స్పెషలే

Update: 2018-02-05 10:48 GMT
ఏ సినిమాకి అయినా ఈ రోజుల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంటేనే పాజిటివ్ టాక్ వస్తుంది. ఆడియెన్ కి ఒక ఫీలింగ్ కలగాలంటే తప్పకుండా బీజీఎమ్ కరెక్ట్ గా ఉండాలని  దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఒత్తిడికి గురి చేస్తుంటారు. ముఖ్యంగా హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్రదానం. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ లలో మ్యూజిక్ కరెక్ట్ గా పడితే వర్క్ కి అందరు ఫిదా అవుతుంటారు.

ఇక రీసెంట్ గా వచ్చిన భాగమతి సినిమా కి కూడా అలాంటి టాక్ వస్తోంది. ఫాస్ట్ బీట్ మ్యూజిక్ తో మెప్పించే థమన్ ఈ మధ్య హర్రర్ కథలకు బెస్ట్ టెక్నీషియన్ అని ఒక బ్రాండ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. భాగమతి లో ఒక మెలోడీ సాంగ్ ఇచ్చి మొత్తంగా బీజీఎమ్ పైనే దృష్టి పెట్టాడు. అయితే థమన్ చేసిన వర్క్ ను యూవీ క్రియేషన్స్ మేకింగ్ వీడియో పేరుతో రిలీజ్ చేసింది. థమన్ కష్టపడిన విధానం గురించి క్లియర్ గా చెప్పాడు.

ఎదో హర్రర్ స్టోరీ అనగానే జూమ్ జూమ్ అని కాకుండా కొత్తగా మ్యూజిక్ తోనే ట్రై చేయాలనీ ఎక్కువగా ఓ లెవెల్లో బీజీఎమ్ ఇచ్చినట్లు థమన్ వివరించాడు. ముఖ్యంగా థీమ్ సాంగ్ చాలా ఇష్టంగా చేసినట్లు థమన్ తెలిపాడు. ఇక వీడియోలో కొన్ని మేకింగ్ సీన్స్ ను కూడా చూపించారు. మొత్తానికి థమన్ చేసిన వర్క్ కి ఎక్కువగా మార్కులు అందాయి. సినిమాను అతని మ్యూజిక్ ఓ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.  

Full View
Tags:    

Similar News