40 వయసులో వాటే కిక్‌ గురూ!!

Update: 2015-09-08 05:12 GMT
''సెప్టెంబర్‌ మాసం ..  సెప్టెంబర్‌ మాసం.. పాత బాధలు తలెత్తుకున్నయ్‌. అక్టోబర్‌ మాసం .. అక్టోబర్‌ మాసం .. కొత్త బాధలు తలెత్తుతున్నాయ్‌.. బాధ తీరు వరకూ.. సేద దీరు సరసం...'' ఈ పాట ఎక్కడో విన్నట్టే ఉంది కదూ..! సఖి సినిమాలోనిదీ పాట. ప్రేయసి, ప్రియుడి మధ్య గొడవలు, కలతలు, మాటా మాటా పట్టింపు, పంతం.. ఆ సందర్భంలో స్నేహితులతో కలిసి అంతా జాలీ ట్రిప్‌ వెళతారు. అక్కడ బీచ్‌ గట్టున ఓ అందాల భామతో కుర్రాళ్లంతా రచ్చ రచ్చ చేసేస్తారు. ఈ పాటలో బీచ్‌ సొగసులతో అందాల భామ ఆటాపాటా పోటీపడుతుంది. నిజంగానే ఇక్కడున్న ఈ ఫోటోల్లో వయ్యారి భామల్ని చూస్తుంటే సెప్టెంబర్‌ మాసం సాంగ్‌ గుర్తుకు రావడం షురూ.. ?

లైఫున్నది ఒక్కటే గురూ.. నచ్చిందేదో చేసెయ్‌ చేసెయ్‌.. వలపు తాకిడితో చంపెయ్‌.. చంపెయ్‌ అంటూ తెగ రెచ్చిపోతున్నారు ఈ భామలంతా. చెలి చయ్య చయ్యా చయ్యా .. కెవ్వు కేకా అంటూ అప్పట్లో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన మలైకా అరోరాఖాన్‌ తన స్నేహితురాళ్లందరితో కలిసి ఇలా ఎగ్జోటికా లొకేషన్‌ లో జాలీ ట్రిప్‌ ప్లాన్‌ చేసింది. గ్రీస్‌ లోని అరుదైన బీచ్‌ లన్నిటినీ చుట్టేసింది. ఆన్‌ సైట్‌ రచ్చ రచ్చ చేసింది.  ఈ బ్యాచ్‌ లో పవన్‌ కల్యాణ్‌ సరసన 'తమ్ముడు' చిత్రంలో నటించిన అతిధి గోవిత్రీకర్‌ కూడా ఉంది. ఈ భామలంతా సూపర్‌ మోడల్స్‌. అందుకే ఇలా ఒంటిపై వలువలైనా లేకుండా బులుగు సముద్రాన్ని జిలుగు రంగులోకి మార్చేశారు. 40వయసులోనూ ఘాటు సుందరీమణులు ఘాటైన ఫోజులతో తెగ రెచ్చిపోయారు. గ్రీస్‌ లో హాలీడేయింగ్‌, జాలీడేయింగ్‌ అదిరిపోయింది గురూ!
Tags:    

Similar News