బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీప్రపంచంలో ఫిట్నెస్ విషయంలో అయినా ఫ్యాషన్ విషయంలో అయినా అమ్మడు ఆల్రెడీ హై లెవెల్ రీచ్ అయిపోయింది. అలాగే ఈ రెండు విషయాల్లో అప్ కమింగ్ అండ్ ప్రెసెంట్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. తాజాగా మలైకా తాను కరోనా నుండి బయటపడిన విషయాలు ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. "మీరు చాలా లక్కీ.. అది చాలా ఈజీ.. మనం రెగ్యులర్ గా వింటుంటాం. అవును నిజంగానే కొన్ని విషయాల్లో నేను గొప్పగానే ఫీల్ అవుతున్నాను. అందులో లక్ అనేది కూడా చిన్న పాత్ర పోషించింది.
కానీ అనుకున్నంత ఈజీగా కాదు. నన్ను బాధించిన విషయం ఏంటంటే.. నేను గతేడాది సెప్టెంబర్ 9న కరోనా బారినపడ్డాను. కోవిడ్ నుండి బయటపడటం చాలా ఈజీ అనేవారు ఎవరైనా ఉన్నారా..? అలాంటి వారుంటే.. ఒకటి వారు అదృష్టవంతులు అయ్యుండాలి లేదా వారికీ కోవిడ్ కష్టాలు గురించి అవగాహన లేకపోవచ్చు. నేను ఫేస్ చేసాను. ఈజీ అంటే నేను మాత్రం అంగీకరించను. ఎందుకంటే అది నన్ను చాలా బాధించింది. నిలబడి రెండడుగులు ముందుకు వేయడమే గగనం అయిపోయింది. హోమ్ క్వారంటైన్ లో బెడ్ పై కూర్చోవడం లేదా బెడ్ దిగి నడవాలి.. వీటన్నిటికంటే ముఖ్యంగా కిటికీ ఎక్కి బయటికి చూడటం ఇదే రొటీన్ అయిపోయింది.
అందువల్ల నేను చాలా వెయిట్ పెరిగి బలహీనంగా.. అసలు శక్తిలేకుండా.. ఇంకా కుటుంబానికి దూరమై ఉండటం ఇలా చాలా విషయాలు నన్ను బాధించాయి. మొత్తానికి సెప్టెంబర్ 26న నాకు కోవిడ్ నెగటివ్ వచ్చింది. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కానీ నాలో బలహీనత అలాగే ఉంది. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నా మైండ్ చెప్పినట్లుగా నా బాడీ సహకరించలేదు. నేను మళ్లీ మాములుగా అవ్వనేమో అని భయమేసింది. 24 గంటల్లో కూడా ఒక పని చేయలేకుండా అవుతానేమో అని. ఇదిలా ఉండగా.. నా ఫస్ట్ వర్కౌట్ ఘోరంగా విఫలం అయింది. ఏది కూడా సరిగా చేయలేకపోయాను. నాలో నేను కుంగిపోయాను. కానీ సెకండ్ డే.. దృఢంగా నాకు నేను చెప్పుకొని సిద్ధం అయ్యాను.
అలా ఒక వారం.. రెండు మూడు ఇలా.. ఇప్పటికి నేను నెగటివ్ పొంది 32వారాలు అవుతోంది. ఇప్పుడు నేను నార్మల్ అయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను నా మనసు చెప్పినట్లుగా వర్కౌట్ చేయగలుగుతున్నాను. ఊపిరితో పాటు అన్ని సరిగ్గానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నన్ను ఆ మహమ్మారి నుండి బయటపడేలా చేసింది మాత్రం నాలుగు అక్షరాల 'హోప్' అనే వర్డ్. నాట్ ఓకే అనిపించినప్పుడు కూడా హోప్ అనేది ఓకే అనే ఫీల్ ఇచ్చింది. నా ఆరోగ్యం గురించి కెరీర్ తీసుకుంటూ.. నన్ను ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే నేను కూడా ఈ ప్రపంచం కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ తాను ఎదుర్కొన్న సందర్భాలు పోస్ట్ లో తెలిపింది.