జిమ్ .. స్నేహాలు.. లవ్ స్టోరీలు ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే ఇండివిడ్యువల్ మహిళ మలైకా అరోరాలో ఇతర కోణాలు ఆశ్చర్యపరిచేవే. నిరంతరం సామాజిక కోణంలో స్పందిస్తూ రకరకాల విషయాలపై ముచ్చటించే తీరు విస్మయపరుస్తుంటుంది. ఇక మహిళా శక్తి గురించి నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మలైకా అద్భుతమైన వ్యాఖ్యను చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో మలైకా ట్వీట్ మహిళల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ``సంతోషకరమైన మహిళలు`` అంటూ ఒక రకంగా మలైకా తన స్వేచ్ఛా జీవనాన్ని ఆత్మవిశ్వాసంతో కూడుకున్న జీవనాన్ని ప్రస్థావించింది.
ఈ రోజు సంతోషకరమైన మహిళలు వివాహితులు కానేకాదు. ఒంటరి వారు కాదు.. స్థిరమైన కెరీర్ .. మంచి ఆదాయం ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అని మలైకా వ్యాఖ్యానించింది. తమను తాము పూర్తిగా ప్రేమించుకోవడానికి సిద్ధంగా ఉండేవారు సంతోషకరమైన మహిళలు. గతాన్ని విడిచిపెట్టి.. వారి ఆత్మగౌరవం కోసం పనిచేసిన మహిళలు సంతోషంగా ఉన్నారు. ఆత్మన్యూనతతో విలపించడం మహిళలు మానేశారు. వారు తమ కోపం.. కన్నీళ్లను జీవితంలో చేదును దాటి వెళ్లారు. ఆనందం చాలా ముఖ్యం .. వ్యక్తిగత అంశాలు చాలా ఇంపార్టెంట్ అని వారు గ్రహించారు. వర్తమానం చూడాలి కానీ వారి గతం కాదు. ఎవరి నుండి ఇప్పుడు ప్రత్యేకంగా అంగీకారం అవసరం లేనందున సంతోషంగా ఉన్నారు`` అంటూ మలైకా వ్యాఖ్యానించారు.
కెరీర్ పరంగా చూస్తే... మలైకా అరోరా ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షోలో న్యాయమూర్తిగా కనిపిస్తోంది. నిరంతరం మోడలింగ్ అసైన్ మెంట్స్ .. ర్యాంప్ షోలతోనూ మలైకా బిజీ బిజీగా ఆదాయం ఆర్జిస్తోంది. ఇక తన వారసుడుని త్వరలో హీరోని చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహకాల్లో ఉంది.