కుమారుడిని చూసి భావోద్వేగానికి గురైన మాజీలు!

Update: 2021-12-12 02:30 GMT
సెల‌బ్రిటీ లైఫ్ లో విడాకులు స‌ర్వ సాధార‌ణ‌మైన అంశంగా మారింది. మ‌న‌స్ఫ‌ర్థ‌లు రానంత‌కాలం క‌లిసి ఉండ‌టం.. వాటికి చోటు క‌ల్పించిన త‌ర్వాత విడిపోవ‌డం... అటుపై ఎవ‌రి జీవితాల్లో వాళ్లు స్వేచ్ఛ‌గా జీవించ‌డం ప‌రిపాటే. బాలీవుడ్ లో మ‌లైకా అరోరా- ఆర్బాజ్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం విడిపోవ‌డం గురించి తెలిసిందే. మ‌లైకా ప్ర‌స్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉంది. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. అయితే తాజాగా మ‌లైకా-మాజీ భ‌ర్త అర్బాజ్ ఖాన్ ముంబై ఎయిర్ పోర్టులో జంటగా క‌నిపించారు. వీరిద్ద‌రికి జ‌న్మించిన కుమారుడు అర్హాన్ ని రిసీవ్ చేసుకోవ‌డం కోస‌మే ఎయిర్ పోర్టులో క‌లిసారు. ఇది అరుదైన దృశ్యం. చూప‌రులు మ‌ర్చిపోలేనిది.

చ‌దువుల‌ నిమిత్తం అర్హాన్ విదేశాల్లో ఉంటున్నాడు. క్రిస్ట‌మ‌స్ సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో అర్హాన్ స్వ‌దేశానికి వ‌చ్చాడు. గారాల సుపుత్రుడు అర్హాన్ ని ముంబై ఎయిర్ పోర్టులో చూసి మ‌లైకా ఎమోష‌న్ కి గురైంది. కుమారుడిని కౌగిలించికుని క‌న్నీటి ప‌ర్యంతం అయింది. అర్భాజ్ కూడా కౌగిలించుకుని సంతోషం వ్య‌క్తం చేసాడు. ఈ ముగ్గురు క‌లిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. విడిపోయినా పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం మాజీలిద్ద‌రు అప్పుడ‌ప్పుడు క‌ల‌వాల్సిందే. కోర్టు ద్వారా ఉత్త‌ర్వులు ఉన్న‌ప్పుడు వాటిని త‌ప్ప‌క పాటించాల్సిందే. ఈ నేప‌థ్యంలో మ‌లైకా-ఆర్బాజ్ జంట‌గా అర్హాన్ ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం మ‌లైకా అరోరా అర్జున్ క‌పూర్ తో రిలేష‌న్ లో ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం చాలా ఉంది. వీళ్లిద్ద‌రి రిలేష‌న్ పైనా నెటి జ‌నులు ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవ‌లే ఈ జంట మాల్దీవులు వెకేష‌న్ కి వెళ్లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక మ‌లైకా సినిమాల విష‌యానికి వ‌స్తే అవ‌కాశాలు బాగా త‌గ్గాయి. అర్జున్ క‌పూర్ మాత్రం న‌టుడిగా బిజీగానే కొన‌సాగుతున్నాడు.
Tags:    

Similar News