సల్మాన్ ఖాన్ సోదరుడు ప్రముఖ నటుడు- నిర్మాత అయిన ఆర్భాజ్ ఖాన్ ని పెళ్లాడిన మలైకా 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. మలైకా-ఆర్భాజ్ జంట ఇంతకుముందు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ జంటకు హీరో కావాల్సిన ఒక టీనేజీ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా.. ఆర్భాజ్ విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు స్వేచ్ఛగా ఉన్నారు. కెరీర్ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. అయితే ఆర్భాజ్ నుంచి విడిపోవడానికి మలైకా ఇంతకుముందు సరైన కారణాలను వెల్లడించలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న కారణం మాత్రం చెబుతున్నారు.
తాజాగా మలైకా చేసిన ఓ వ్యాఖ్యతో ఆ కుటుంబంలో ఆమె నంబర్ వన్ స్థానం కోరుకుందని అర్థమవుతోంది. ఇంతకీ మలైకా చేసిన కామెంట్ ఏమిటీ? అంటే.. అర్బాజ్ ఖాన్ కుటుంబం తనను 'నంబర్ వన్ పర్సన్'గా చూడలేదని అయితే తనకు మద్దతుగా నిలిచారని మలైకా అరోరా వ్యాఖ్యానించింది. అర్బాజ్ ఖాన్ కుటుంబ సభ్యులు తమ కొడుకు అర్హాన్ కారణంగా ఇప్పుడు అవసరమైన సమయంలో కనిపిస్తారని అన్నారు.
మలైకా అరోరా రియాలిటీ షో 'మూవింగ్ ఇన్ విత్ మలైకా' రెండవ వారంలో ఉంది. ప్రతి కొత్త ఎపిసోడ్ తో మలైకా తన అభిమానులకు ఇంతకు ముందు తెలియని తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని రహస్యాల గురించి ఓపెనవుతుంటే అవి దుమారంగా మారుతున్నాయి. ఇటీవలి ఎపిసోడ్ లో కరణ్ జోహార్ తో మలైకా చాటింగ్ సంచలనంగా మారింది. అర్జున్ కపూర్ తో మలైకా బెడ్ రూమ్ రహస్యాలు.. ఆర్భాజ్ తో ఈక్వేషన్ సహా ప్రతిదీ కరణ్ గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో వాటికి సమాధానాలిస్తూ మలైకా వేడెక్కించింది.
మలైకా ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రాణాంతకమైన కార్ ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత అర్బాజ్ ఖాన్ కుటుంబం మొత్తం తనను పరామర్శించింది. తాజా ఎపిసోడ్ లో ఈ విషయాన్ని కూడా కరణ్ ప్రస్థావించారు. "మీ ప్రమాదం తర్వాత కుటుంబం (భాయ్ ఫ్యామిలీ) మొత్తం పరామర్శకు వచ్చారు. ఆ తర్వాత నేను నాతో ఇంటికి తిరిగి తీసుకెళ్లిన విషయం నాకు గుర్తుంది. మీ కుటుంబం మిమ్మల్ని ఆదరిస్తోందనేది నా ఉద్దేశ్యం"అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా మలైకా కాస్త వ్యంగ్యంగానే వ్యాఖ్యానించింది. "వారు వస్తారు.. ఎందుకంటే తన వారసుడు అర్హాన్ కోసం వస్తారు! అని వ్యాఖ్యానించింది.
మలైకా ఏప్రిల్‌లో ముంబై-పూణే హైవేపై ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. కానీ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆ తర్వాత ఆర్భాజ్ ఖాన్ కుటుంబీకులు తనను పరామర్శించారు. కరణ్ తో ఎపిసోడ్ లో మలైకా ఇంకా మాట్లాడుతూ ఆ ఫ్యామిలీ రహస్యాలను బయటపెట్టింది. అర్బాజ్- మలైకా ఇరువురు తమ కుమారుడికి సహ-తల్లిదండ్రులుగా ఉన్నందున తనని ఆర్భాజ్ కుటుంబీకులు పరామర్శించారని మలైకా వ్యాఖ్యానించింది."నేను వారి కుటుంబ జాబితాలో నంబర్ వన్ వ్యక్తిని కాకపోవచ్చు.. కానీ అర్హాన్ ఉన్నందున వారు అలా చేస్తారు. అది సరైన పనే!" అంటూ కొంత వ్యంగ్యాన్ని ప్రదర్శించింది.
కొన్ని సంవత్సరాలుగా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న మలైకా తాజా షోలో మాజీ భర్తతో తన ప్రస్తుత ఈక్వేషన్ గురించి కూడా మాట్లాడింది. "ఇప్పుడు నా జీవితంలో ప్రతిదీ మనోహరంగా ఉందని నేను భావిస్తున్నాను. మేం (ఆర్భాజ్- మలైకా) ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నామని నేను భావిస్తున్నాను" అని ఆమె కరణ్ తో అన్నారు.
మునుపటి ఎపిసోడ్ లో కార్ ప్రమాదం తర్వాత అర్బాజ్ తనను కలిసాడని.. తన పక్కనే ఉన్నాడని తెలిపింది. నేను ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లినప్పుడు చూసిన మొదటి ముఖాలలో ఒకటి అర్బాజ్. ఆ సమయంలో అతను నన్ను అడిగేవాడు. "నువ్వు చూడగలవా?' ఎన్ని సంఖ్యలు? ఎన్ని వేళ్లు?" అని తనకు తన చేతి వేళ్లను చూపిస్తూ అడిగాడట. అతడు "ఎందుకు ఇలా చేస్తున్నాడు?" అన్నది చాలా విచిత్రంగా అనిపించిందని మలైకా అంది.
ఒక సెకను తర్వాత "నేను సరే.." అని అన్నాను!! నేను గతించిన కాలంలో వెనక్కి వెళ్లిపోయానా? అనిపించింది. నిజంగా కష్ట సమయాల్లో అతడు అలా అడిగాడు. అది గతం.. వర్తమానం.. భవిష్యత్తు.. జో భీ హో (ఏమైనా జరిగినా) అని అందరికీ తెలుసు. అతను అక్కడ ఉన్నాడనేది నిజం!! అని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది మలైకా.
మలైకా- అర్జున్ కొన్నేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ఆర్భాజ్ వేరొక యువతితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మలైకా గర్భవతి కావచ్చు అనే ఊహాగానాలు సోషల్ మీడియాల్లో సాగాయి. అర్జున్ ఆ తర్వాత ఆ వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాల్లో ఫైరయ్యాడు. "ఇది నీచస్థితికి దిగజారి రాయడం.. చెత్త వార్తలను మోసుకెళ్ళడం పరమ రొటీనే.. సున్నిత విషయాల్లో పూర్తిగా అనైతికంగా ఉండటం సరికాదు!!" అని అర్జున్ ఘాటుగా ప్రతిస్పందించారు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవడానికి ధైర్యం చేయవద్దు! అని కూడా వార్నింగ్ ఇచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.