బాలీవుడ్ స్టార్లు మలైకా అరోరా- అర్జున్ కపూర్ ప్రేమాయణం గురించి తెలిసిందే. 40 ప్లస్ ఐటమ్ గాళ్ తో 30 ఏజ్ కుర్రాడి రొమాంటిక్ లైఫ్ పై బోలెడన్ని మీమ్స్ ని నెటిజనులు షేర్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇవేవీ ఆ ఇద్దిరికీ పట్టవు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అన్యోన్యమైన జంటగా పాపులరయ్యారు. ఏజ్ తో పనేం ఉంది మనసుండాలే కానీ! అని నిరూపించారు. ఇక ఇప్పటికి మలైకా మానసిక స్థితి ఎలా ఉంది? అంటే.. తన జీవితాంతం అర్జున్ కపూర్ తో గడపాలని తన కోరికను వ్యక్తం చేసింది. దీంతో ఇది వారి వివాహానికి సంబంధించిన సూచనేనా? అంటూ బాలీవుడ్ లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మలైకా అరోరా-అర్జున్ కపూర్ ముంబై లోని ఖరీదైన లొకేషన్లలో రెస్టారెంట్లలో నిరంతరం దర్శనమిస్తూ హెడ్ లైన్స్ లోనే నిలుస్తున్నారు. కొన్నిసార్లు వారి వయస్సు వ్యత్యాసం కారణంగా ప్రేక్షకుల నుండి ఊహించని సన్నివేశాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఇద్దరు సెలబ్రిటీలు క్లిష్ఠ సమయంలో పరీక్షలో నిలిచి గెలిచారు. తరచుగా భాగస్వాములపై తమ ప్రేమను సోషల్ మీడియాలో పంచుకోవడం చూస్తున్నదే. ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రముఖ సెలబ్రిటీ షో జడ్జి గా ఉన్న మలైకా అర్జున్ ను `నా మనిషి` అని సంబోధించారు. ఆమె అతనితో వృద్ధాప్యం వరకూ సాగాలని కోరుకుంటున్నట్లు కూడా అన్నారు. జీవితాంతం తనకే అంకితమయ్యానని అన్నారు.
మలైకా అరోరా తన జీవితాంతం అర్జున్ కపూర్ తో గడపాలని తన కోరికను ఈ వేదికపై వ్యక్తం చేసింది ఒక ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా అరోరా తమ భవిష్యత్తు గురించి తరచుగా చర్చిస్తున్నట్లు పేర్కొంది. అతడితో ఆమె ఆమెతో అతడు ఒకరినొకరు ఆనందం పొందుతున్నామని.. తరచుగా ఒకే విమానంలో ప్రయాణిస్తుంటామని కూడా తెలిపింది మలైకా. వారు పరిణతి చెందిన దశలో ఉన్నప్పటికీ ఇంకా ఇంకా తెలుసుకునేందుకు అన్వేషించేందుకు ఈ లోకంలో చాలా ఉందని.. భవిష్యత్ ప్రయాణం కలిసి సాగించేందుకు ఇష్టపడుతున్నామని ఆమె పేర్కొన్నారు.
మలైకా- అర్జున్ ప్రారంభ సంవత్సరాల్లో వారి సంబంధం గురించి చాలా అరుదుగా మాట్లాడినప్పటికీ ఈ జంట చుట్టూ అనేక ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఇప్పుడు అంతా మారిపోయింది. తమమధ్య అనుబంధం ప్రేమ గురించి మాట్లాడటానికి చర్చించడానికి ఇరువురు చాలా ఓపెన్ గా ఉన్నారు. డ్యాన్సింగ్ క్వీన్ మలైకా తరచూ అర్జున్ పై తన విశ్వాసాన్ని ఉంచింది.
అతడు హామీని ఎలా ఇస్తాడో అలానే ఉంటాడని నమ్మకం వ్యక్తం చేసింది. ఈ సంబంధంలో తాను సంతోషంగా సానుకూలంగా ఉన్నాననే అంగీకరించింది. వారు నెమ్మదిగా జీవితంలో ఏం కావాలో ప్రతిదీ కనుగొంటారు. అయితే అతను తన వ్యక్తి అని తనకు తెలుసు అని ఆమె మరింతగా నమ్మకాన్ని ఇప్పుడు మరోసారి వ్యక్తం చేసింది.
మలైకా అరోరా అర్బాజ్ ఖాన్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు సంసార జీవనంలో ఉన్నారు. ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. వారు 2017లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమెకు అర్జున్ లో ప్రేమ కనిపించింది. వెంటనే డేటింగ్ మొదలైంది. అయితే అర్బాజ్ జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.