అర్జున్ క‌పూర్ కాదు, అత‌డంటే ఇష్ట‌మ‌న్న మ‌లైకా!

Update: 2021-09-24 00:30 GMT
మ‌లైకా అరోరా.. త‌న క‌న్నా చాలా చిన్న వ‌య‌సు వాడైన అర్జున్ క‌పూర్ మ‌న‌సును గెలుచుకున్న న‌టి. త‌న డ్యాన్స్ ప్ర‌తిభ‌తో ద‌శాబ్దాలుగా వెలుగులో ఉన్న న‌ర్త‌కి. బ‌డా ప్రొడ్యూస‌ర్ లాంటి వ్య‌క్తి అయిన భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి, త‌న క‌న్నా చాలా చిన్న వ‌య‌సు వాడైన బాలీవుడ్ యువ హీరోతో స‌హ‌జీవ‌నం సాగిస్తున్న బోల్డ్ మెంటాలిటీ మ‌లైకా.

ఈ విష‌యంలో విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు ఖాతరు చేయ‌డం లేదు. పెళ్లి, నిశ్చితార్థం వంటి మాట ప‌ట్టింపులు లేకుండా అర్జున్ క‌పూర్ తో లివింగ్ రిలేష‌న్షిప్ ను అధికారికంగా కొన‌సాగించేస్తోంది. అయితే అర్జున్ క‌పూర్ ఈ న‌టీమ‌ణికి అల్టిమేట్ క్ర‌ష్ కాన‌ట్టుగా ఉన్నాడు!

త‌న‌కు హాలీవుడ్ లో ఒక క్ర‌ష్ ఉంద‌ని అంటోంది మ‌లైకా. చాలా మంది తార‌లు చెప్పిన‌ట్టుగా.. త‌న హాలీవుడ్ క్ర‌ష్ గురించి మ‌లైకా చెప్పింది. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టుడు డేనియ‌ల్ క్రేగ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని అంటోంది మ‌లైకా. ఆ బాండ్ న‌టుడిపై ఈమె ఎప్పుడో మ‌న‌సు పారేసుకుంద‌ట‌.

ఇలాంటి క్ర‌ష్ లు ప్ర‌తి ఒక్క‌రికీ ఉండేవే. మ‌రి మ‌లైకా చెబుతున్న ఈ పేరును విని అర్జున్ క‌పూర్ ఉడుక్కుంటాడో, త‌న‌క‌న్నా చాలా పెద్ద వ‌య‌సు మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న బ్రాడ్ మెంటాలిటీతో స‌ర‌దాగా తీసుకుంటాడో!



Tags:    

Similar News