జక్కన్న చెప్పే వరకూ సీక్వెల్ లేనట్లే!
రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` భారత్ గర్వించదగ్గ చిత్రంగానే కాదు ప్రపంచ దర్శక దిగ్గజాలే మెచ్చే చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` భారత్ గర్వించదగ్గ చిత్రంగానే కాదు ప్రపంచ దర్శక దిగ్గజాలే మెచ్చే చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. ఆస్కార్ అవార్డు సహా ఎన్నో అవార్డు-రివార్డులను అందు కుంది. సంచలన హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ సైతం మెచ్చిన గొప్ప చిత్రంగా నిలిచింది ఆర్ ఆర్ ఆర్. బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
అలాంటి సినిమాకి సీక్వెల్ తీస్తే చూడాలని ఎవరికి ఉండదు? అందుకే సీక్వెల్ చేస్తే బాగుంటుందని ఆ సినిమా నిర్మాతలు ఆస్కార్ వచ్చిన రోజే మనసులో మాట చెప్పేసారు. ఆ వెంటనే కథ రాయడానికి నేను కూడా సిద్దంగానే ఉన్నానంటూ విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. కానీ రాజమౌళి మాత్రం మౌనం వహించాడు. అందరు సీక్వెల్ కి సిద్దంగా ఉన్నా జక్కన్న నుంచి మాత్రం ఎలాంటి సంకేతం రాలేదు.
ఇటీవలే `ఆర్ ఆర్ ఆర్` డాక్యుమెంటరినీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పరిమితంగా కొన్ని థియేటర్లో రిలీజ్ చేసారు. ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. సీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అది జరగాలంటే? రాజమౌళి ఊ కొట్టాలి. అప్పటి వరకూ అది సాధ్యమయ్యే పనికాదు.
గ్యాలరీలో కూర్చుని ప్రేక్షకులు ఎంత అరిస్తే ఏం లాభం క్రీజ్ లో బ్యాట్స్ మెన్ బాదకపోతే! అన్నట్లే ఇప్పుడు సన్నివేశం కనిపిస్తుంది. ప్రేక్షకులు చంకలు ఎంత గుద్దుకున్నా? అసలి వ్యక్తి స్పందించకపోతే జరిగేది కాదిది. అయితే `ఆర్ ఆర్ ఆర్` కి అద్భుతమైన ముగుంపు రాజమౌళి అప్పుడే ఇచ్చేసారు. ఆ కథకు ఎలాంటి కంటున్యూటీ ఉన్నట్లు ఎక్కడా ఎలాంటి లీడ్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే సాధ్యమయ్యేదేమో. అందుకే రాజమౌళి కూడా సైలెంట్ గా ఉన్నాడు? అన్నది మరికొంత మంది అభిప్రాయం.