విశ్వంభర సైలెన్స్ రీజన్ ఏంటి..?
విశ్వంభర సినిమా సమ్మర్ రిలీజ్ అని టాక్ వచ్చినా ఇప్పుడు అది సమ్మర్ కి కూడా రావడం కష్టమనేలా ఉంది.;

భోళా శంకర్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా విశ్వంభరతో రాబోతున్నాడు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ వండర్ గా రాబోతుందని తెలుస్తుంది. చిరు నటించిన జగదేక వీరుడు అతిలోకసుందరి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. వశిష్ట రాసుకున్న స్టోరీ లైన్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జతగా త్రిష నటిస్తుంది.
ఆమెతో పాటు మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లు కూడా సినిమాలో భాగం అవుతున్నారు. ఐతే విశ్వంభర సినిమాను అసలైతే ఈ సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. చరన్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ఉన్న కారణంగా అది వాయిదా వేశారు. ఐతే అప్పటికీ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని టాక్. విశ్వంభర కథ కథనాలతో పాటు గ్రాఫిక్స్ కూడా అంతే ప్రాధాన్యతతో ఉంటాయని తెలుస్తుంది.
అందుకే వశిష్ట ఈ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. సినిమాలోని కొన్ని విజువల్స్ ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేలా ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఫ్యాన్స్ కి సంథింగ్ స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
సినిమాలో చిరు లుక్ ఇంకా క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. విశ్వంభర సినిమా సమ్మర్ రిలీజ్ అని టాక్ వచ్చినా ఇప్పుడు అది సమ్మర్ కి కూడా రావడం కష్టమనేలా ఉంది. సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఏంటన్నది అర్థం కావట్లేదు. సమ్మర్ కాకపోతే జూన్, జూలై లో అయినా విశ్వంభర సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది.
మరి విశ్వంభర మీద ఉన్న అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. చిరు సినిమా సెట్స్ మీద ఉన్నా కూడా ఈ సైలెన్స్ ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేస్తుంది. ఐతే త్వరలో ఒక మంచి టీజర్ తో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు. మెగా మార్క్ మూవీగా రాబోతున్న విశ్వంభర తో మెగాస్టార్ చిరంజీవి రికార్డులే టార్గెట్ గా పెట్టుకున్నాడని చెప్పొచ్చు.