ముగ్గురిలో కామన్ పాయింట్..ఎవరు పవర్ ఫుల్!
సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` తో..గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ `డాకు మహారాజ్` తో, విక్టరీ వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` తో..గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ `డాకు మహారాజ్` తో, విక్టరీ వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. మూడు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాలు అంకంతకు పెంచేస్తున్నాయి. సంక్రాంతికి సరైన పందెం కొట్టే పుంజు ఏది అవుతుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సక్సెస్ పై ఎవరి ధీమా వారుకుంది. ఎవరి స్టైల్లో వారు ప్రచారం నిర్వహిస్తున్నారు.
మరి ఈ మూడు సినిమాలో కామన్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఉందనే తెలుస్తోంది. `గేమ్ ఛేంజర్` లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. అందులో ఒకటి రామ్ నందన్ రోల్ ఎంతో పవర్ పుల్ గా ఉంటుంది. అది ఐఏఎస్ అధికారి రోల్. ప్రభుత్వ అధికారి పాత్రల్ని శంకర సినిమాల్లో ఎంత బలంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. `ఒకే ఒక్కడు` అర్జున్ రోల్ తరహాలో ఉంటుందనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలస్తుందని శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక విక్టరీ వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` లో మాజీ ఐపీఎస్ అధికారి రోల్ పోషిస్తున్నారు. ఆ పాత్రలో హాస్యాన్ని ఎంత బాగా పండిస్తాడో అంతే సీరియస్ ని అనీల్ రావిపూడి హైలైట్ చేస్తాడు. `సరిలేరు నీకెవ్వరు`లో లో మహేష్ ఆర్మీ రోల్ తరహాలో హైలైట్ చేస్తున్నారని లీకులందుతున్నాయి. అలాగే నటసింహ బాలకృష్ణ `డాకు మహారాజు`లో త్రిపాత్రిభనయం చేస్తున్నారు. ఇంత వరకూ ఎక్కువగా హైలైట్ అయింది డాకు పాత్ర మాత్రమే. కానీ మరో రెండు పాత్రల్లో ఓ పాత్ర ఐపీఎస్ రోల్ అని సమాచారం.
ఈ పాత్రని బాబి ఇంకా రివీల్ చేయలేదు. ఆన్ స్క్రీన్ పై ప్రేక్షకుల్ని ఐపీఎస్ రోల్ తో థ్రిల్ చేయాలనే దాచి పెట్టి నట్లు లీకులందుతున్నాయి. బాబి సినిమాల్లో ఇలాంటి సర్ ప్రైజ్ లు ఉంటాయి. సడెన్ గా అలాంటి పవర్ ఫుల్ రోల్ తో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించడం బాబి స్పెషల్. అందుకే ఆ రోల్ గురించి రివీల్ చేయలేదంటున్నారు. అలా ఈ మూడు సినిమాల్లో ప్రభుత్వ అధికారి పాత్రలు ఆ సినిమాలకు హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది.