మాళవిక మోహనన్.. ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న సౌత్ ఇండియన్ హాట్ హీరోయిన్. ఇంకా నేరుగా తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టలేదు కానీ.. ఈ అమ్మాయి తమిళంలో బాగానే ఫేమస్. రజనీకాంత్ సినిమా పేటలో ఆయన చెల్లెలిగా నటించిన మాళవిక.. విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ లో హీరోయిన్ పాత్రతో కెరీర్ లో పెద్ద అడుగే వేసింది. మన విజయ్ దేవరకొండ హీరోగా గత ఏడాది ఆరంభమైన హీరో సినిమాతో ఆమె తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాల్సింది. అనివార్య కారణాలతో ఆ సినిమా ఆగిపోవడంతో మాళవికకు బ్రేక్ పడింది. ఐతే సూపర్ సెక్సీగా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు చేసే హాట్ ఫొటో షూట్లతో మన కుర్రాళ్లకు కూడా బాగానే కిక్కు ఇస్తూ ఉంటుంది. లాక్ డౌన్ టైంలోనూ ఆమె ఫొటోలు బాగానే హైలైట్ అవుతున్నాయి.
ఐతే ఆమె ఇప్పుడో వివాదంలో చిక్కుకుని నెటిజన్ల ఆగ్రహం చూడాల్సి వచ్చింది. లాక్ డౌన్ టైంలో అందరూ ఇంటి పట్టున ఉంటున్న సంగతి తెలిసిందే. ఐతే ఓ కుటుంబంలో మిగతా వ్యక్తులందరూ ఎవరి వ్యాపకాల్లో వాళ్లుంటే మహిళలకు మాత్రం ఖాళీ ఉండట్లేదని.. వాళ్లు వంట పనులతో సతమతం అవుతున్నారని సంకేతాలిస్తున్న ఓ కార్టూన్‌ను ఆమె ట్విట్టర్లో షేర్ చేయగా.. తమిళ అభిమానులు ఆమె మీద ఎటాక్ చేయడం గమనార్హం. మాళవిక షేర్ చేసిన కార్టూన్లో తప్పిదమేమీ లేకున్నా.. మహిళల బాధ గురించి చెప్పేలా ఉన్నా ఆమెను విమర్శిస్తున్నారు. సెలబ్రెటీ లేడీవి నీకేం కష్టం తెలుసు.. అంటూ ఆమెను నెటిజన్లు తగులుకున్నారు. ఆమెకు మద్దతుగా చిన్మయి వచ్చి విమర్శకులపై ఎదురుదాడి చేసినా ఫలితం లేకపోయింది. చివరికి మాళవిక తన ట్వీట్ ను డెలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మాళవిక సగటు మహిళ బాధ చెబితే ఆమెను ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.