భావన కేసులో కొత్త ట్విస్టు

Update: 2017-06-26 13:05 GMT
కొన్ని నెలల కిందట మలయాళ సినీ నటి భావనపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునిని పోలీసులు అరెస్టు చేసి.. ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా పల్సర్ సుని అనేక సంచలన విషయాలు బయటపెట్టినట్లుగా వార్తలొచ్చాయి. ఓ మలయాళ పెద్ద హీరో.. ప్రముఖ దర్శకుడు కలిసి భావనపై అటాక్ కు ప్లాన్ చేసినట్లుగా మీడియాలో చర్చ నడిచింది. ఆ హీరో దిలీపే అంటూ ఊహాగానాలు వినిపించాయి. ఐతే ఇప్పుడు దిలీప్ వినిపిస్తున్న వాదన.. పోలసులకు చేసిన ఫిర్యాదు కేసును కొత్త మలుపు తిప్పేలా ఉన్నాయి.

భావన కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో తన పేరు చెప్పకుండా ఉండాలంటే రూ.1.5 కోట్లు ఇవ్వాలని పల్సర్ సుని తనను బెదిరించినట్లుగా ఆరోపిస్తున్నాడు దిలీప్. ఈ విషయమై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భావన కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని దిలీప్ ఆరోపించాడు. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పాలిగ్రాఫ్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని దిలీప్ అంటున్నాడు. ఐతే సుని తన పేరు చెప్పడం ఖాయమని తెలిసే దిలీప్ ముందస్తుగా ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా డ్రామాలాడుతున్నాడన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసుకు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News