కమర్షియల్ కాదు.. కంటెంట్ ని నమ్మే పరిశ్రమ అది..!

Update: 2022-10-19 14:30 GMT
100 ఏళ్లు పైబడిన భారతీయ చలన చిత్ర రంగంలో ఇప్పటికీ మూవీ అంటే కమర్షియల్ మాత్రమే కాదు కంటెంట్ కూడా ఉండాల్సిందే అని నిరూపిస్తున్న పరిశ్రమ మళయాళ చల చిత్ర పరిశ్రమ. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో సైతం కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మూడు పాటలు ఆరు ఫైట్లు హీరో ఎలివేషన్ లాంటి రొటీన్ ఫార్ములా అక్కడ చెల్లదు.

ఇండియన్ సినిమాలో అప్పటికీ ఇప్పటికీ మళయాళ పరిశ్రమ తన ప్రత్యేక చాటుకుంటుంది. వారి సినిమాలు ఆర్ట్ మూవీస్ లా అనిపించినా అవి కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తాయి.

మళయాళ సినిమాలు అది బడ్జెట్ ఎంత చిన్నదైనా.. పెద్దదైనా సరే కంటెంట్ విషయంలో రాజీ పడేది ఉండదు. అది సినిమా చూసిన ఆడియన్స్ కి కూడా అర్ధమవుతుంది. ఈ దశాబ్ధ కాలంలో మళయాళ సినిమాలు చూస్తే కంటెంట్ తో వచ్చి కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఉన్నాయి.

రియాలిటీకి దగ్గరగా సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యే.. అనుభూతి చెందే కథలతో మళయాళ సినిమాలు ఉంటాయి. అందుకే వారి సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. భాష తెలియకపోయినా అరే భావం తో మళయాళ సినిమాలను ఆదరించే ఇతర భాషా ప్రేక్షకులు ఉన్నారని చెప్పొచ్చు.

ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నా సరే అక్కడ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి కూడా ప్రయోగాత్మక సినిమాలు చేస్తారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ఇతర భాషల్లో రీమేక్ చేయబడిన విషయం తెలిసిందే. ఎంచుకున్న కథకు పూర్తి న్యాయం చేయడమే కాకుండా కథకు అవసరం లేని కమర్షియల్ హంగులని కూడా దూరం పెడుతూ మళయాళ సినిమాలు ఉంటాయి.

అందుకే మళయాళ సినిమా వచ్చింది అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక విషయం ఉంటుందని ప్రేక్షకుల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. వారి సినిమాలతో అలరించిన మళయాళ స్టార్స్ ని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో తీసుకుంటున్నారు. మళయాళ పరిశ్రమ నుంచి దుల్కర్ సల్మాన్, పృధ్వి రాజ్, ఫాహద్ ఫాజిల్ ఇలాంటి స్టార్స్ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుఇల అభిమానాన్ని సంపాదిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News