కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన 'మహానటి' ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ మూవీలో జెమినీ గణేషన్ పాత్రలో జీవించి సర్ ప్రైజ్ చేశారు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.
తెలుగులో నటించిన తొలి చిత్రంతో మంచి మార్కులు కొట్టేపిన దుల్కర్ ఆ తరువాత ప్రధాన పాత్రలో హీరోగా నటించిన తొలి తెలుగు మూవీ 'సీతారామం'. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా 'ఓ యుద్ధంతో రాసిన ప్రేమకథ' అంటూ ప్రేక్షకుల హృదయాల్ని తాకి ఎఓమోషనల్ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
టాలీవుడ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న వేళ ఆగస్టులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించిన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందులో లెఫ్టనెంట్ రామ్ గా దుల్కర్ ప్రదర్శించిన నటన, సీతగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కనబరిచిన అభినయం.. వెరసి సినిమా ప్రశంసల వర్షం కురిపించింది. నటుడిగా మంచి పేరున్న దుల్కర్ సల్మాన్ ఈ మూవీతో మరో మెట్టు ఎక్కడం విశేషం.
వరల్డ్ వైడ్ గా విమర్శకుల ప్రశంసలతో పాటు రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తోంది. ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీతో దుల్కర్ కు తెలుగులో తిరుగులేని గుర్తింపు లభించడం విశేషం. ఇదిలా వుంటే దుల్కర్ విజయాల పరంపర కొనసాగుతూనే వుంది. ఈ మూవీ తరువాత దుల్కర్ బాలీవుడ్ మూవీలో నటించాడు.
తనదైన మార్కు సినిమాలతో విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంటున్న బాలీవుడ్ డైరెక్టర్ ఆర్. బాల్కీ తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'చుప్'. సినీ విమర్శకులని వరుసగా అత్యంత దారుణంగా హత్యలు చేసే సైకో కిల్లర్ కథగా తెరకెక్కిన మూవీ ఇది. తాజాగా విడుదలైన ఈ మూవీలో దుల్కర్ సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు. తనదైన మార్కు నటనతో కిల్లర్ పాత్రలో ఆకట్టుకున్న దుల్కర్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
దుల్కర్ కిల్లర్ పాత్రలో మరో సారి మెస్మరైజ్ చేశాడని అంతా అంటున్నారు. సన్నీ డియోల్, శ్రేయాస్ ధన్వంతరీ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.